నా భార్య నాతో బిడ్డని కని ఇంకొకడితో వెళ్లిపోయింది సంవత్సరం తర్వాత ఇప్పుడు వస్తానంటోంది

మా పెళ్లి చాల ఘనంగా జరిగింది. నేను నా భార్యను చాలా బాగా చూసుకునేవాణ్ని. మా అన్యోన్యానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఇద్దరం ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా బతికేవాళ్లం. మా కాపురంలో ఎప్పుడూ ఏ కలహాలు రాలేదు. నా భార్యకు నేనంటే ప్రాణం అనుకున్నాను. కానీ అది అబద్దమని తెలిసేసరికి నా ప్రాణం పోయినంత పనైంది.మాకు బాబు పుట్టిన తర్వాత నా భార్య ప్రవర్తన మారిపోయింది.

నాతో చిన్నచిన్న విషయాలకే గొడవ పెట్టుకునేది. మొదట్లో నన్ను ఎంతో ప్రేమించే నా భార్య తీరులో తర్వాత చాలా మార్పు వచ్చింది.మొదట్లో నువ్వు నాతో ఉంటే చాలు.. నాకు గంటలు కూడా సెకన్ల మాదిరిగానే గడుస్తాయి అనేది నా భార్య కానీ తను నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడేది. నా భార్యకి నాతో పెళ్లికాకముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.

వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులట. వారి ఇద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారట. అయితే వారి ప్రేమను పెద్దలు ఒప్పులేదట.మహేశ్వరి ప్రెగ్నెంట్ అయ్యాక పుట్టినింటికి వెళ్లింది. అక్కడ మళ్లీ మహేశ్వరి బాయ్ ఫ్రెండ్ రోజూ ఫోన్‌లో మాట్లాడడం మొదలుపెట్టాడు. బాబు పుట్టిన తర్వాత తను నా దగ్గరకు వచ్చింది. ఇక్కడికి వచ్చాక కూడా రోజూ తను ఫోన్లో చాటింగ్ చేసేది.

ఈ విషయాలన్నీ తెలియడంతో నేను నా భార్యను ఒకరోజు నిలదీశాను.నీకు ఇప్పుడు నాతో పెళ్లి అయ్యింది. నువ్వు ఇలా చేస్తే ఎలా అని అన్నాను. అయినా మనకు బాబు కూడా పుట్టాడు. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో అన్నాను. తను వినలేదు. పైగా తన బాయ్ ఫ్రెండ్ తనకోసం మ్యారేజీ కూడా చేసుకోలేదని అతడంటే తనకు ప్రాణమని చెప్పింది. నాకు నీతో కాపురం చెయ్యడం ఇష్టం లేదు అంది. నన్ను వదలిపెట్టేసెయ్ అంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పింది. తర్వాత బాబును తీసుకొని పుట్టింటికి వెళ్లింది.

ఊర్లో తను, తన బయ్ ఫ్రెండ్ ని డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకుని మాట్లాడుతుందని నాకు కొంచం లెట్ గా తెలిసింది.ఒక రోజు రోడ్డు పై వెళ్తుంటే ఒక గ్యాంగ్ నాపై అటాక్ చేసింది. కానీ చుట్టుపక్కన అందరూ తెలిసిన వారే ఉండడంతో నన్ను కాపాడారు.ప్రమాదాన్ని తప్పించుకున్నాను. ఆ గ్యాంగ్ నా భార్య ప్రియుడుకు సంబంధించినది అని తెలిసింది. తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాను. తను నాకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో వెళ్లిపోతానని నాతో చెప్పింది. నాకు ఏమీ అర్థం కాలేదు.నేను ఎంత చెప్పినా నాతో ఉండటానికి తను ఒప్పుకోలేదు. పెద్దలు కూడా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. బాబును నాకు అప్పగించి తను అతనితో వెళ్లిపోయింది.

కొన్నాళ్లు నేను ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాను.నా జీవితం తను నాశనం చేసి వెళ్లిపోయింది. నేను కుమిలిపోయాను. అలా నన్ను పెళ్లి చేసుకుని నాతో బాబును కని ఇంకొకడితో వెళ్లిపోయింది. మహేశ్వరిని ఆమె ప్రియుడి కొన్ని రోజులు బాగా యూజ్ చేసుకున్నాడు. తర్వాత అతను ప్లేట్ ఫిరాయించాడు. మహేశ్వరిని మోసం చేసి ఎటో వెళ్లిపోయాడు. మహేశ్వరికి బుద్ది వచ్చింది. మళ్లీ ఇప్పుడు తను నా దగ్గరకు వస్తానంటోంది. నీకు ఆ అర్హత లేదని చెప్పేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *