ఇక నుండి అన్ని గ‌వ‌ర్న‌మెంట్ పాఠశాలలోనూ ఉచితంగా డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్

దేశంలోనే ఎక్కువ‌మంది విద్యావంతులున్న రాష్ట్రం కేర‌ళ‌. ఇప్పుడు మ‌రో రికార్డు సృష్టించ‌బోతోంది. ఇండియాలోనే ఫ‌స్ట్‌టైం రాష్ట్రంలోని గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ అన్నింటిలోనూ డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్ సిస్టంను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. జూన్ 1 నుంచి అన్ని స్కూల్స్‌లోనూ డిజిట‌ల్ లెసెన్సే చెప్ప‌బోతున్నారు.

కేర‌ళ‌లోని 9,279 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7 తరగతుల వరకు ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (ఐసీటీ) బేస్డ్ గా చదువు చెప్పేందుకు ఆ రాష్ట్ర విద్యా విభాగం నిర్ణయించింది. దీనికోసం అన్ని స్కూల్స్‌కు కంప్యూట‌ర్లు, ఇంట‌ర్నెట్‌, డిజిట‌ల్ క్లాస్‌రూమ్ సెట‌ప్స్ స‌మ‌కూరుస్తోంది. 70,602 మంది టీచ‌ర్లకు డిజిట‌ల్ టీచింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించింది. క్లాస్‌రూమ్స్‌లో ఐటీని భాగం చేసేందుకు జూన్‌ 1 నుంచి ఐటీ క్లాస్‌రూమ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్ రవీంద్రనాథ్ చెప్పారు. 5 నుంచి 7 తరగతులకు ఈ-విద్య పేరిట ఐసీటీ టెక్ట్స్ టెక్స్ట్ బుక్స్‌, ప్రైమరీ స్కూల్స్‌ కోసం ఆపరేటింగ్‌ సిస్టమ్‌, రిసోర్స్‌ డీవీడీలను రిలీజ్ చేసింది. అన్ని స్కూల్స్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ప‌దేళ్ల క్రిత‌మే స్టార్టింగ్ కేర‌ళ‌లో 2005 నుంచి ఐసీటీ బేస్డ్ ఎడ్యుకేష‌న్ సిస్టం ప్రారంభించారు. 8 -10 క్లాస్‌ల‌కు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి దీన్ని అమ‌లు చేయ‌నున్నారు. ఇందుకోసం 8,918 పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్‌ను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌తో గ‌వ‌ర్న‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *