స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ప్రజలు సిగరెట్లను తాగుతున్నారు. దీంతో చాలా మంది ఊపిరితిత్తుల కేన్సర్, ఇతర వ్యాధుల“ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలతో మరణించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. పొగ తాగడం వల్లే ఊపిరితిత్తుల కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా వెల్లడించింది. సిగరెట్ తాగేవారికే కాకుండా సెకండ్ హ్యండ్ స్మోకర్స్ సిగరెట్ తాగేవారి సమీపంలో ఉండి ఆ సిగరెట్ పొగ పీల్చుకునేవారు కూడా కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. మరి ఊపిరితిత్తుల పనితీరు ఏమిటి, వాటికి వచ్చే సమస్యలేమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

వాస్తవానికి శ్వాసక్రియ చెప్పుకోవడానికి చాలా సులువుగానే అనిపిస్తున్నప్పటికీ అది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ.
కుడి ఊపిరితిత్తి మూడు భాగాలుగా, ఎడమ ఊపిరితిత్తి రెండు భాగాలుగా విభజించబడి ఉంటాయి. వాటిని తమ్మెలుగా అంటారు. మనం గాలి పీల్చుకున్నప్పుడు అవి ఉబ్బి.. గాలి వదిలినప్పుడు తిరిగి యథాస్థితికి వస్తాయి.
శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు నుంచి శ్వాస నాళం ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది.ఊపిరితిత్తుల్లో శ్వాస నాళికలు ఉంటాయి. వాటిని బ్రోంకియొల్స్ లేదా వాయు గదులుగా పిలుస్తారు. మొత్తంగా మన ఊపిరితిత్తుల్లో సుమారు 4.80 కోట్ల (480 మిలియన్స్) వాయు గదులు ఉంటాయి. ఈ వాయు గదులకు కేశనాళికల (అత్యంత సన్నని రక్త నాళాల) ద్వారా రక్తం సరఫరా అవుతుంది.
మనం గాలిని లోపలికి పీల్చుకున్నప్పుడు అది ఈ వాయుగదుల్లోకి చేరుతుంది. అక్కడ రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి.. గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి మార్పిడి అవుతుంది. అనంతరం ఊపిరితిత్తుల్లోని గాలి నిశ్వాస ద్వారా బయటకు వెళ్లిపోతుంది. వాయుగదుల్లో ఆక్సిజన్ నిండిన రక్తం గుండెకు చేరుతుంది.

పొగతాగే అలవాటుకు తోడు విపరీతంగా దుమ్మూ, ధూళితో కూడిన పరిసరాల్లో ఉండేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు. స్త్రీలలో కంటే పురుషుల్లో కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో ఊపిరితిత్తుల కేన్సర్ విజృంభణపై వారు పరిశోధన చేశారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్లు, రావడానికి కారణమైన అధ్యయనాలను పరిశీలించి క్రోడీకరించారు. పొగతాగే అలవాటు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు వంటి పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నట్లు తేల్చారు.ఈ కేన్సర్ బారిన పడితే దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం రావడం, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, తల నొప్పి, ఎముకల నొప్పి, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. వీటితోపాటు దీర్ఘకాలంగా దగ్గు ఉండడం, శ్వాస తీసుకోవడం, వదలడంలో ఇబ్బందిగా ఉండడం, ఆకలి మందగించడం, గొంతు బొంగురు పోవడం, అలసట, బలహీనంగా తయారవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *