మెదడు చురుగ్గా ఉండాలంటే ఈ పదీ పాటిస్తే చాలు

మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే.. మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.మెదడు పనితీరు సమర్థవంతంగా ఉండడానికి తోడ్పడే పది అంశాలేమిటో తేల్చారు. వాటి గురించి తెలుసుకుందాం.

వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తి (రక్తంలోని గ్లూకోజ్)లో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు (న్యూరాన్లు) అత్యంత సున్నితమైనవి. వాటికి కనీసం ఒకటి రెండు నిమిషాలు శక్తి అందకపోయినా దెబ్బతింటాయి.

కానీ శరీర వ్యవస్థ మొత్తం మెదడుకు పూర్తిస్థాయి రక్షణ, ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందించబడి ఉంటుంది. దాంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి. ఇదే సమయంలో ఇతర అవయవాలకు శక్తి రవాణాను తగ్గించి.. మెదడుకు అందిస్తాయి. దాంతో మెదడు మరింత శక్తిని పుంజుకుంటుంది..’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఫెర్నాండో గొమెజ్ వెల్లడించారు.

శరీరంలో అధికంగా గ్లూకోజ్ ఉండడం లేదా అతి తక్కువగా ఉంటుండడం వంటివి మెదడులోని సున్నితమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయని ఇంగ్లాండ్ కు చెందిన రోహంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని, దానివల్ల మెదడులో కీలకమైన ‘ఫ్రంటల్ కార్టెక్స్’ భాగం పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని గుర్తించినట్లు వారు చెబుతున్నారు. అందువల్లే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు ఏదైనా విషయంపై దృష్టి సారించలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, గందరగోళ పడడం వంటివి తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.

ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలని, ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్ వీలైనంత తక్కువగా ఉండాలని బ్రిటన్ కు చెందిన ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ గ్రీన్ చెబుతున్నారు. శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో దీర్ఘకాలంలో మెదడు సామర్థ్యం తగ్గిపోయినట్లుగా తమ అధ్యయనంలో గుర్తించామని వెల్లడించారు.

ఆహారంలో అధిక కొవ్వుల కారణంగా మెదడులో జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానమైన హిప్పో కాంపస్ భాగం పనితీరు దెబ్బతింటుందని మైఖేల్ గ్రీన్ పేర్కొన్నారు. అయితే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు మాత్రం మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలకు ఇది బాగా అవసరమని తెలిపారు.

మధుమేహం, ఊబకాయం సమస్యలు ఉన్న వారికి శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే మనం నిద్రపోయినప్పుడు కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అప్పటివరకు జరిగిన, విన్న, చూసిన ఘటనలకు సంబంధించి సమాచారాన్ని నిద్రా సమయంలోనే విశ్లేషించుకుంటుంది. ప్రతి అంశాన్ని జ్ఞాపకంగా మార్చకుండా.. కొన్ని ఘటనలను తొలగించేస్తుంది. మరికొన్నింటిని తాత్కాలిక జ్ఞాపక శక్తిగా, మరికొన్నింటిని శాశ్వత జ్ఞాపకాలుగా మార్చి భద్రపరుస్తుంది. తద్వారా మెదడుపై భారం తగ్గిపోయి.. విశ్రాంతి స్థితికి వెళుతుంది. తిరిగి మనం నిద్ర లేచిన తర్వాత పూర్తి శక్తితో చురుగ్గా పనిచేస్తుంది.

డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చేపలు తింటే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఒమేగా-3 సప్లిమెంట్లు (మాత్రలు) అందుబాటులో ఉన్నాయి. కానీ అలా కృత్రిమంగా రూపొందించిన వాటికన్నా ఆహారం రూపంలో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.చేపలతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, గడ్డి తినే జంతువుల మాంసంలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *