రజని కాంత్ కు మద్దతు ఇచ్చిన కమల్ హాసన్

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు చిత్ర వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. రజనితో రాజకీయంగా, పలు అంశాల్లో విభేదిస్తున్నప్పటికీ, సినిమాల పరంగా తాము ఇప్పటికే ఒక్కతాటిపై నిలుస్తామని నిరూపించాడు కమల్. కాలా సినిమా విడుదల వివాదం నేపథ్యంలో కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో రజనీకాంత్ కు తన మద్దతు ఉంటుందని అన్నారు.

తన విశ్వరూపం సినిమాను కూడా కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే అని కమల్ గుర్తుచేశారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని సమస్య తీర్చేందుకు కృషి చేయాలనీ అన్నారు. రజని తాజా సినిమా కాలాను చూసేందుకు ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారని కమల్ అన్నారు. రైతుల సమస్యల తరహాలోనే ప్రతి సమస్య, వివాదాన్ని సంబందించిన బోర్డు, శాఖా గాని చర్చించి సమసిపోయేలా చేయాలనీ సూచించారు.

కాగా, కాలా మూవీ విడుదలకు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రజనీకాంత్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద భద్రతా కల్పించాలని కన్నడ భాషలో ఓ సందేశాన్ని కుమారస్వామికి పంపారు. మూవీ విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చినా.. ప్రస్తుతం వివాదాలు తలెత్తుతాయని కొన్ని రోజులు వేచి చూడాలని కుమారస్వామి సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *