బ్రహ్మానందానికి సినిమాలు రాకపోవడానికి టాప్ సీక్రెట్ ఇదేనట

ట్రెండ్ మారింది. కొత్త దర్శకులు దూసుకువస్తున్నారు. కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. కొత్తదనం లేనిదే ముందుకు పోవడం లేదు. భరత్ అనే నేను మూవీలో అసలు కామెడీ ట్రాకే లేదు. సీరియస్ పొలిటికల్ డ్రామా. అయినా హిట్ అయ్యింది. అదంతా కథలోని గొప్పదనమే. అందులోనూ కామెడీ ట్రాక్ పెట్టొచ్చు . కానీ కథ దెబ్బతింటుందని కొరటాల శివ ఆ ప్రయత్నం చేయలేదు. అయినా బాక్సాఫీస్ వద్ద భరత్ హిట్ కొట్టింది. కాసులు కురిపించింది. కొత్తగా ఏ సినిమా వచ్చినా దర్శకులు కథకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేటి కాలానికి అనుగుణంగా కథను తీర్చిదిద్దుతున్నారు. అందుకే బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్లకు అవకాశాలు తగ్గిపోయాయి.. జబర్ధస్త్ తో పాపులర్ అవుతున్న కుర్ర కమెడియన్లకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.


ఈ కుర్రాళ్లు నేటి నేటివిటీకి సరిపోవడంతో బ్రహ్మీ పాత్రలను వీరే చేజిక్కించుకుంటున్నారు. కొత్తదనం కోసం కూడా దర్శకులు ఈ కొత్త కమెడియన్స్ కే అవకాశాలు ఇస్తున్నారు.. ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే సినిమా లేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బ్రహ్మానందం లేకుండా సినిమాలు చాలా వస్తున్నాయి.హిట్స్ కొడుతున్నాయి. బ్రహ్మానందంకు ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ (వయసు పైబడడం) ఆయనకు మైనస్ గా మారింది. బ్రహ్మానందంకు సరిపోయే పాత్రలను నేటి నవతరం దర్శకులు సృష్టించడం లేదు. పైగా కొత్తదనం కోసం వాస్తవ పరిస్థితులతో కథలను రాస్తుండడంతో బ్రహ్మీ సహా సీనియర్ కమెడియన్లకు, నటులకు అవకాశాలు రావడం లేదు.

అందుకే ఇప్పుడు తెలుగు నాట దూసుకొస్తున్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్, జబర్ధస్త్ కమెడియన్ల వరుస అవకాశాలు దక్కించుకుంటుండగా..బ్రహ్మానందం లాంటి సీనియర్లు మాత్రం పాత్రల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.నిజానికి బ్రహ్మానందం మేనియా ఫుల్ గా ఉన్నప్పుడు సినిమా షూటింగ్ లలో ఒక్కో రోజుకు బ్రహ్మానందం 5 లక్షలవరకు తీసుకునేవాడటకానీ ఇప్పుడు రోజుకు 2 లక్షల వరకూ తగ్గించినా బ్రహ్మీకి పాత్రలు దక్కడం లేదంటే పాపం మనల్ని అందర్నీ ఏళ్ల తరబడి నవ్విస్తున్న ఓ కమెడియన్ కు వచ్చిన గడ్డు పరిస్థితికి బాధపడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *