శివుడికి పాలిచ్చి ఆకలి తీర్చిన ఆవు గొప్ప క్షేత్రంగా మారిన ఆ స్థలం

నిజాయితిగా వారి కోసం ఏమి చేయాడానికి అయిన సిద్దంగా ఉంటూ ఏమి ఆశించని వారిని శివుడి ముందు నంది అంటుంటారు.అలా ఎందుకు అంటారో మీలో చాలా మందికి తెలిసే ఉండవొచ్చు.నంది శివుడి ముందు ఎప్పటికి ఉంటాడు అలా నందిశ్వరుడి కోరిక మేరకు ఏర్పడిన ఆలయమే మహానందిశ్వర ఆలయం.శివుడి వాహనం అయిన నందిశ్వరుడు ఆయనను చూడకుండా ఒక్క క్షణం అయిన ఉండలేడు.అందుకే శివుడు ఎక్కడ వెలిసిన ఆయన ఎదుటనే నంది ఉంటుంది తనకు శివునికి మధ్యలో భక్తులు ఏ మాత్రం అడ్డం వచ్చిన నంది చాలా భాదపడుతుందట ఈ కారణంగా ముందుగా ఆయిన అనుగ్రహాన్ని సంపాదించుకొని ఆ తర్వాత పరమేశ్వరుడిని దర్శించుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ దగ్గర గొప్ప పుణ్యక్షేత్రం మహానంది.ఏడవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో స్వామి వారు మహా నందిశ్వరుడిగా అమ్మ వారు కామేశ్వరి దేవిగా పూజలు అందుకుంటున్నారు అన్ని దేవాలయాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడ శివలింగం చిన్నగా ఉంటుంది.అందుకు ఒక కారణం లేకపోలేదు ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం దానికి ఒక కథ ఉంది.

పూర్వం నంద మహారాజు పాలనలో గోపవరం గ్రామంలో ఆ గ్రామస్థుడికి ఒక ఆవుల మంద ఉండేది అందులో కపిల అనే ఆవు నల్లమల అడవిలో పచ్చగడ్డి మేస్తు ఇక్కడ పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి రోజు పాలు ఇస్తూ ఆకలి తీర్చేది.ఆ ఆవు రోజు అడవిలో పాలు విడుస్తుందన్న విషయం నంద మహారాజుకు కూడ తెలిసింది,ఈ వింత గురించి తెలుసుకుందామని ఆయన అడవికి వస్తాడు

అక్కడ కపిల ఆవు పాలు పుట్టలో పాలు విడవడం రాజు కు కనపడుతుంది ఇదేంటో ఇంకా స్ప్రష్టంగా చూడాలని రాజు ఇంకా కొంచెం ముందలకు పోబోతుంటే ఆవు బెదిరి తన కాలుతో పుట్టను తొక్కుతుంది ఆ క్షణమే పుట్టలో ఉన్న పాలరూప శివుడు గోమాత ఇద్దరు మాయమైపోతారు అలా ఎందుకో జరిగిందో ఆలోచిస్తూ రాజ్యానికి భయలుదేరుతాడు మహారాజు ఆరోజు రాత్రి పరమశివుడు కలలోకి వచ్చి ఆ పుట్టలో పాలు త్రాగింది నేనే అని చెబుతాడు అంతేకాక నా కోసం అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి నేను శివలింగం గ అక్కడ కొలువై ఉంటాను నీ కీర్తి శాశ్వతంగా చరిత్రలో నిలుస్తుంది అని చెబుతాడు.పరమ శివుని ఆజ్ఞ మేరకు నంధమహరాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు,అక్కడ శివలింగం పై ఆ పుట్ట గుర్తు ఇంకా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *