మెదడు చురుగ్గా ఉండాలంటేఈ పది చిట్కాలు పాటిస్తే చాలు

ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ మనసుకు ఏదీ తట్టదు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. ఎందుకిలా.మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే.మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం బాగా పెరుగుతాయి. ఇంకా ఏకాగ్రత కూడా సమకూరుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.మెదడు పనితీరు సమర్థవంతంగా ఉండడానికి తోడ్పడే పది అంశాలేమిటో తేల్చారు. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం మెదడు చురుగ్గా ఉండడానికి.. శారీరక శ్రమకు, వ్యాయామానికి ఏమిటి సంబంధం అనుకోవద్దు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో వెల్లడించారు  శారీరక శ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి.. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శారీరకంగా ఫిట్ గా ఉంటే మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుందని గుర్తించారు.

వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తి రక్తంలోని గ్లూకోజ్లో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు అత్యంత సున్నితమైనవి. వాటికి కనీసం ఒకటి రెండు నిమిషాలు శక్తి అందకపోయినా దెబ్బతింటాయి.కానీ శరీర వ్యవస్థ మొత్తం మెదడుకు పూర్తిస్థాయి రక్షణ, ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందించబడి ఉంటుంది. దాంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి.

కడుపు మాడ్చుకోవద్దు మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతం వరకు మాత్రమే ఉంటుంది కానీ అది వినియోగించుకునే శక్తి ఏకంగా 20 శాతం. శరీరంలో అధికంగా గ్లూకోజ్ ఉండడం లేదా అతి తక్కువగా ఉంటుండడం వంటివి మెదడులోని సున్నితమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయని ఇంగ్లాండ్ కు చెందిన రోహంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని, దానివల్ల మెదడులో కీలకమైన ‘ఫ్రంటల్ కార్టెక్స్’ భాగం పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని గుర్తించినట్లు వారు చెబుతున్నారు. అందువల్లే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు ఏదైనా విషయంపై దృష్టి సారించలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, గందరగోళ పడడం వంటివి తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.ఇక ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు..

ఆహారంలో సమతుల్యత ముఖ్యం మెదడు ఆరోగ్యంగా, ఇంకా  చురుకుగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఆహార అలవాట్ల వల్ల దీర్ఘకాలికంగా మేలు చేస్తుందని, మెదడు పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.

శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మనం శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉంటే.. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏదైనా వ్యాధులు, జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. అది మెదడుపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పట్టిపీడించే టైప్-2 మధుమేహం, ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటివి మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయి.

తగినంత, సరైన నిద్ర, విశ్రాంతి అవసరం మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. నిద్ర కూడా కలత నిద్ర, మగతగా నిద్రించడం వంటివి కాకుండా పూర్తిస్థాయి గాఢ నిద్ర ఉండాలి. మొత్తంగా రోజుకు కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని..పని మధ్యలోనూ అప్పుడప్పుడు పది పదిహేను నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.మనం మెలకువతో ఉన్నంత సేపూ మనం చూస్తున్న, వింటున్న, అనుభూతి చెందుతున్న ప్రతి జ్ఞాపకం మెదడులో చేరుతుంది.

మనలో మెదడు చురుగ్గా పనిచేయడానికి చేప మాంసం అద్భుతంగా తోడ్పడుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయని, దెబ్బతిన్న నాడీవ్యవస్థను మరమ్మతు చేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి మానవ పరిణామ క్రమంలో మెదడు అభివృద్ధికి, ఆలోచనా, విశ్లేషణా శక్తి సమకూరడానికి ప్రధానంగా తోడ్పడింది చేప మాంసమేనని పరిశోధకులు ఒక విస్తృత అధ్యయనంలో ప్రాథమికంగా గుర్తించారు కూడా.

సరదాగా గడపండి నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఒత్తిడులు, అతిగా ఆలోచించడం కారణంగా మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో హానికర రసాయనాలు ఉత్పత్తి అవుతాయని.. అవి మెదడు పనితీరును మందగింపజేస్తాయని చెబుతున్నారు.

అనవసర మందులు, ఔషధాలకు దూరంగా ఉండండి జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి బ్రెయిన్ పిల్స్, మెమరీ బూస్టర్స్ అంటూ మార్కెట్లో వివిధ రకాల పేర్లతో ఎన్నో రకాల మందులు, ఔషధాలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఒమేగా-3 సప్లిమెంట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ల వంటి వాటిని జనం కూడా ఎక్కువ సంఖ్యలో  కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *