మల్టీస్టారర్ సినిమాలో అనసూయ

ఈ మధ్య బుల్లితెరపై ఎంతగానో అలరిస్తున్న హాట్ యాంకర్స్  మరియు వెండితెరపై కూడా మంచి నటనతో ఆకట్టుకుంటున్నారు. గత కొంత కాలంగా జబర్దస్త్ షోలో కొనసాగుతోన్న హాట్ యాంకర్ అనసూయ ఎంతగా పాపులర్ ఏయిందో  మన అందరికి తెలిసిందే. ఆ షో ద్వారా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మంచి ఆఫర్స్ ను అందుకుంటూ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తుంది  క్షణం సినిమాలో క్లిక్ అయిన ఈ బ్యూటీ  రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో మరింత క్రేజ్ ని దక్కించుకుంది.

రామ్ చరణ్ కు అత్తగా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే .ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయకు మంచి  ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం తనకు నచ్చిన కొన్ని క్యారెక్టర్స్ ని మాత్రమే సిగ్నల్ ఇస్తుంది . ఒకే చేసే ముందు కథలో కీలకమైన పాత్రనా లేక నార్మల్ క్యారెక్టరా అని గట్టిగానే అరా తీస్తోందట. ఇక అసలు విషయానికి వస్తే. అనసూయ రీసెంట్ గా ఒక మంచి ప్రాజెక్ట్ లో అవకాశాన్ని కూడా దక్కించుకుంది.

విక్టరీ వెంకటేష్ మరియు  వరుణ్ తేజ్ హీరోగా F2 అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడిఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఒక క్యారెక్టర్ చేస్తారా అని అడగ్గానే అనసూయ ఏ మాత్రం నో చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినదంతా సినిమాలో కీలకమైన పాత్రే అని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని తెలుపలేదు గాని దాదాపు అనసూయ F2 ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *