చిటికెలో రుణం కావాలా అయితే సిబిల్ స్కోర్ చూడండి ఇలా

సిబిల్ స్కోరు చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఒకరిని అడగవలిసిన అవసరం  ఉండదు. అయితే, ఈ క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా లేదా  వ్యక్తిగత రుణం అయినా, వాహన, ఇంటి రుణం ఏదైనా తీసుకోవాలన్న  బ్యాంకులకు సిబిల్ స్కోర్ ముఖ్యమైనది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే కావలిసిన రుణం సులభంగా  వచ్చేస్తుంది. అందుకే చిటికెలో రుణం  రావాలంటే సిబిల్ స్కోర్ 900కు గాను 750 పైన ఉండాలి. అంత స్కోరు కావాలీ అంటే కొన్ని చిట్కాలు పాటించాలి అవి ఏమిటి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు  బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇప్పటి వరకూ అప్పు తీసుకున్న దాఖలాలు లేకుంటే క్రెడిట్ కార్డుతో ప్రస్థానం ప్రారంభించవచ్చు. అలా అని ఏదో ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకునేరు.వార్షిక రుసుములు, వడ్డీ చార్జీలుమరియు  వడ్డీ లేని వ్యవధి ఇలాంటివన్నీ పరిశీలించి అనువైనది తీసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు  వాడేయకండి. కొద్ది కొద్ది మొత్తాల్లో మాత్రమే రుణాన్ని వాడుకుంటూ నిర్ణీత గడువులోపు వాయిదాలను చెల్లిస్తూ.తీసుకున్న రుణం మొత్తాన్ని కచ్చితమైన కాల వ్యవధిలోపు తిరిగి కట్టేయాలి  కనిపించిన ప్రతిదీ క్రెడిట్ కార్డుతో కొనేస్తానంటే  మీరు కష్టాల్లో పడినట్టే. అప్పుడు తిరిగి చెల్లించడం కష్టమై సిబిల్ స్కోరు పడిపోతుంది. కనుక క్రెడిట్ కార్డు రుణమే కాదు ఏ రుణమైనా గడువు లోపు వాయిదాలు చెల్లించడం చాలా చాల ముఖ్యం.

క్రెడిట్ కార్డు ఒక్కటే కాదు. రుణాలు ఎప్పుడూ మిక్స్ డ్ గా ఉంటే స్కోర్ కు బలం పెరుగుతుంది. వాహన రుణం, వ్యక్తిగత రుణం, గృహోపకరణాలకు రుణం. ఇలా ఎన్నో రుణాలు పొందవచ్చు. అయితే, అన్ని రుణాలనూ ఒకేసారి తీసుకునే పొరపాటు అస్సలు చేయకండి. ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటే చాల మంచిది  ఎందుకంటే ఏకకాలంలో పలు రుణాలకు దరఖాస్తు చేసుకుంటే..బ్యాంకులు సిబిల్ స్కోర్ కు క్యూ కడతాయి. రిక్వెస్టులు ఎక్కువైతే..సిబిల్ స్కోరు పై ప్రభావం పడుతుంది.

రిపోర్ట్ ను చూడాలి సిబిల్ స్కోరు, రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే అందులో వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలేమైనా తప్పుగా ఉంటే రుణం అవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదురు అవ్వచ్చు . కనుక ఏడాదిలో ఒకటి రెండు సార్లయినా సిబిల్ రిపోర్ట్ ను పరిశీలించుకోవాడాం మంచిది.సిబిల్ స్కోరు ఎంత అనే విషయాన్ని ఎవరికి వారు ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.ఏడాదికోసారి  మాత్రమే ఉచితమే అంతకు మించి కావాలంటే నిర్ణీత చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *