గుండె పోటు అవునో కాదో ఈ లక్షణాలు చెప్పేస్తాయి

మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఏటా కోటి కేసులు కూడా నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ ఎక్కువుగా బారిన పడుతున్న కేసుల సంఖ్య అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎంతోమంది. ఇది గుండెపోటు లక్షణాలని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అందుకే గుండెపోటు లక్షణాలన్నవి తెలుసుకుని  అవగాహనతో ఉండడం ఎంతో అవసరం.

హార్ట్ ఎటాక్ అనేది వైద్యపరంగా అత్యవసర పరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. మరియు రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ కూడా అందదు.దీంతో ప్రాణాంతకం మారుతుంది . ప్రతి 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారు గుండె పోటు బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారు అధికంగా ఉంటున్నారు.

చాతీ భాగంలో గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం. గుండెకు సంబంధించి ఆర్టరీ పూడుకుపోయినా లేదా హార్ట్ ఎటాక్ లోనూ మరియు చాతిలో నొప్పి ఇంకా పట్టేసినట్టు, ఒత్తిడి అనిపిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవం కనిపించవచ్చు కొందరికి గుండెపై ఏనుగు కూర్చున్నట్టు భారంగా ఉంటుంది. మరి కొందరిలో నొక్కినట్టు కాలుతున్నట్టు భావన కలుగుతుంది. కొందరిలో చాతిలో అసౌకర్యంగా కూడా ఉండవచ్చు . ఇదేదో ఒకటి రెండు నిమిషాలు ఉండిపోయేది కాదుచాలా సేపు ఉంటుంది.

ఏదైనా పనిచేస్తున్న సమయంలో లేదా నిద్రలోనూ ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా చిన్న నొప్పి అయి అలా ఉన్న చోట చేతితో అదిమినప్పుడు నొప్పి పెరిగితే అది గుండెకు సంబంధించినది కాకపోవచ్చు. వైద్య పరంగా చాతీ నొప్పిని యాంజినాగా పేర్కొంటారు. సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధిలో కనిపించే లక్షణం. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. సైతం ఈ తరహా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లడం మంచిది.

గుండె పోటు సమయంలో కొంత మందిలో వాంతులు కావడం కూడా జరుగుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లో గుండె పోటు సమయంలో ఇది ఎక్కువగా కనిపించే లక్షణం. ఇంకా కడుపులో మంట, కడుపులో నొప్పి, అజీర్తి కూడా ఇంకా తిన్న ఆహారం సరిపడక, ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందుల వల్ల కనిపించే లక్షణాలుగా గుర్తునిచవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన అంశమేమిటంటే గుండె పోటు సమయంలోనూ ఇవి కనిపిస్తుంటాయి కనుక నిర్లక్ష్యం చేయరాదు.

చేయి మరియు భుజం నొప్పి గుండె పోటు సమయంలో ముందుగా కనిపించే లక్షణాల్లో ఇదీ కూడా ఒకటి. నొప్పి ప్రథమంగా చాతీలో మొదలై అక్కడి నుంచి ఎడమవైపు చేతిలోకి, భుజంలోకి విస్తరిస్తుంది. గుండె పోటు బాధితుల్లో ఎక్కువ మందిలో ఇలా జరుగుతుంది కొందరిలో రెండు చేతుల్లోనూకూడా నొప్పి రావచ్చు. అలాగే వెన్ను, మెడ, కడుపులోనూ నొప్పి కనిపించవచ్చు.

తల తిరగడం మరియు తల నొప్పి బలహీనత, పోషకాహారం తీసుకోకపోవడం, ఆహారం మానేసిన సందర్భాల్లో తల తిగరడం,ఇంకా తలనొప్పి రావచ్చు. ఒకవేళ మనం తీసుకొనే ఆహారంలో ఈ విధమైన లోపాలు లేకుండా, ఉన్నట్టుండి కళ్లు తిరుగుతూ, తలనొప్పి, చాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కి తీసుకోని వెళ్ళాలి.గొంతు లేదా దవడ నొప్పి అన్నవి జలుబు, సైనస్ సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు. కొన్ని సందర్భాల్లో గుండె నొప్పి సమయంలో చాతీ భాగంలోని అధిక ఒత్తిడి గొంతు, దవడ వైపుకు ఎగదన్నుతుందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవడం మంచిది అని నిపుణులు సలహా.

గుండె ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని శరీరానికి అవసరమైనంత పంప్ చేయలేని స్థితి వల్ల అలసట, ఆయాసం కనిపిస్తాయి. గుండె పనితీరు తగ్గుతోందన్న దానికి సంకేతంగా శరీర బరువు పెరగడాన్ని అనుమానించవచ్చు. అదే సమయంలో ఊపిరితిత్తుల్లోనూ నీరు చేరడం వల్ల రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థానంలో ఆక్సిజన్ ను నింపి పంపే ప్రక్రియకు కలుగుతుంది. దీంతో త్వరత్వరగా అలసిపోతుంటారు. నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఎంతో అలసటగా ఉంటుంది.

చెమట పైన చెప్పుకున్న లక్షణాల్లో చాతీ పట్టేసినట్టు ఉండి చెమటలు పడుతుంటే మాత్రం అది గుండె పోటు కు సంకేతమేనంటున్నారు వైద్య నిపుణులు.అదే పనిగా దగ్గు వస్తుంటే గుండె జబ్బే అనడానికి లేదు కానీ, గుండె జబ్బులున్నవారు, గుండెజబ్బుల రిస్క్ ఉన్న వారిలో ఈ విధంగా నిరంతరంగా దగ్గు వస్తూ, కళ్లె పడుతుంటే వైద్యులను సంప్రదించడమే మంచిది.

గురక వస్తుంటే గుండెకు సంబంధించిన సమస్య ఉందేమో అని అనుమానించడం మంచిదే.కానీ చిన్నగా ఎప్పుడో కొద్ది సమయం పాటే రావడం వేరు. అలా కాకుండా అదే పనిగా పెద్ద శబ్దంతో వస్తుంటే మాత్రం అది స్లీప్ ఆప్నియా సమస్యకు సంకేతం కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *