క్షమాపణ చెబుతారో లేదంటే క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటారో మీ ఇష్టం పవన్‌కు ఆర్కే నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరియు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ లీగల్ నోటీసులు పంపించారు. తన సంస్థపై ఊహాజనితంగా చేసిన ఆరోపణలను, ట్వీట్లను బేేషరతుగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.

పవన్ తన వ్యక్తిగత, రాజకీయ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేస్తున్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో కొంచెం అయినా వాస్తవం లేదని తేల్చి చెప్పారు. పవన్ ఆరోపిస్తున్నట్టు టీఆర్పీ కోసం మహిళలను దూషించే అలవాటు తమకు లేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తా సంస్థలు నియంత్రణ సంస్థలకు లోబడి పనిచేస్తాయని స్పష్టం చేశారు.

పవన్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అయన అన్నారు. నేరపూరిత కుట్రలో భాగంగా మరికొందరితో కలిసి పవన్ ఈ ట్వీట్లు చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని ఆర్కే పూర్తిగా వివరించారు. ఆయన ట్వీట్ల కారణంగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన పరువుకు భంగం వాటిల్లిందని కూడా నోటీసులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన పవన్.చేసిన ట్వీట్లపై వివరణ ఇచ్చి బహిరంగంగా రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని రాధాకృష్ణ తివర్మగా  హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *