ఆందమైన జీవితానికి 5 తప్పనిసరి బీమాలు

పాలసీలు అంటే కొందరికీ ఇష్టం ఉండదు వాటి కోసం డబ్బులు ఖర్చు చేయడం వారి దృష్టిలో వృథా. కానీ అనుకోని పరిస్థితులు ఎదురైతే..ఆర్థికంగా కష్టనష్టాల పాలు కాకుండా బీమా పాలసీలు ఆదుకుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ బీమా పాలసీలు తీసుకోవడం ఎంతో అవసరం. మరి ఏ పాలసీ తీసుకోవాలి.ఎలా తీసుకోవాలి ఏది అనవసరం అన్న సందేహం కూడా రావచ్చు. ఎవరైనా గానీ, తీసుకోవాల్సిన 5 తప్పనిసరి బీమాలు ఉన్నాయి.జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణ, ప్రమాదం కారణంగా కలిగే అంగవైకల్యానికి బీమా, ఇంటి బీమా ఇంకా ఇంట్లోని వస్తువులకు బీమా, వాహనానికి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇవి ఎంత మొత్తానికి తీసుకోవాలి.

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనుకోకుండా చనిపోతే అతడిపై ఆధారపడిన వారిని ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. అందుకే ఒక వ్యక్తి లేకపోయినా, అతడి కుటుంబం కష్టాల పాలు కాకుండా ఉండాలంటే అతడి ప్రణాళిక మేరకు పిల్లల చదువులు మరియు వివాహం సహా అన్ని బాధ్యతలు సాఫీగా పూర్తయ్యేందుకు బీమా పరిహారం అవసరం. కుటుంబంలో సంపాదించే ఓ వ్యక్తి పిల్లల చదువులకు, మరి అదే వ్యక్తి మరణిస్తే బీమా పాలసీ లేకుంటే ఇవన్నీ ఎలా సాకారం అవుతాయి. అతడి కుటుంబం ఈ లక్ష్యాలను ఎలా చేరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి.

వైద్య బీమా జీవిత బీమా కంటే వైద్య బీమా ఇంకా చాలా చాలా అవసరం. ఎందుకంటే అనారోగ్యం ఎదురైతే భారీ ఖర్చు భరించడం అందరికీ సాధ్యం కానీ పని . చిన్న చిన్న అనారోగ్యానికే వేలు ఖర్చవుతున్నాయి ఈ రోజుల్లో . ఆస్పత్రిలో చేరి రెండు రోజులు ఉంటే రూ.50 వేలకు పైనే ఖర్చవుతున్నాయి.ఇది మన అందరికి తెలిసిందే . అందుకే కుటుంబ సభ్యులు అందరికీ వైద్య బీమా అందించే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి.

అవివాహితులు అయితే సింగిల్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది.
కుటుంబ సభ్యులు అందరికీ వైద్య బీమా కోసం ఏటా రూ.15వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు. రూ.60 ఏళ్ల వయసుకు మించిన వారు ఉంటే వారి కోసం విడిగా పాలసీ తీసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. పాలసీ ఏదైనా వాటికి అదనపు హంగులు అవీ, ఇవీ జోడించినవి అయితే, ప్రీమియం పెరిగిపోతుంది. వీటికి బదులు సాధారణ పాలసీలు తీసుకోవడం వల్ల అదనపు ఖర్చులనుండి తప్పించుకోవచ్చు. నలుగురు సభ్యుల ఉన్న కుటుంబానికి కనీసం రూ.3 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అవసరం అవుతుంది.

అయితే, సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు హాస్పిటల్ ఖర్చులన్నింటినీ చెల్లిస్తాయి. కానీ, అనుకోకుండా క్లిష్టమైన అనారోగ్యం బారిన పడితే వ్యయం బీమా కవరేజీ కంటే ఎక్కువైతే ఏంటి పరిస్థితి. అప్పుడు మిగిలిన వ్యయం అంతా సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు లివర్ దెబ్బతిని దాన్ని మార్పిడి చేయాల్సి వస్తే అపరేషన్ కు రూ.10 లక్షలకు పైనే ఖర్చవుతుంది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా ఇంత కంటే ఎక్కువే అవుతుంది. అందుకే ఈ భారం వద్దనుకుంటే క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీని తప్పకుండా చేసుకోవాలి. ఈ కవరేజీని జీవిత బీమా పాలసీ లేదా వైద్య బీమా పాలసీలకు జతగా తీసుకునే వెసులుబాటు కలిపిస్తుంది.

ప్రమాద బీమా మరణం సంభవిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. వైద్య బీమా అనారోగ్యం పాలైతే ఆదుకుంటుంది. మరి ప్రమాదం బారిన పడితే. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా అంకవైకల్యానికి గురైతే.పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మన దేశంలో నిత్యం భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతు ఉంటాయి . అందుకే ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పాలైనా పరిహారం చెల్లించేందుకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అవసరం. పైగా ఈ పాలసీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. జీవిత బీమా, వైద్య బీమా పాలసీలకు యాడాన్ కవర్ గా దీన్ని తీసుకోవచ్చు.

వాహన థర్డ్ పార్టీ కవరేజీ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి థర్డ్ పార్టీ కవరేజీ కూడా తప్పకుండా తీసుకోవాలి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో బాధితులు పరిహారానికి వ్యాజ్యం దాఖలు చేస్తే అప్పుడు ప్రమాదానికి కారణమైన వాహనదారుడికి కష్టాలు మొదలవుతాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ ఉంటే బాధితులకు బీమా కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది.

రూ.60వేల మోటార్ సైకిల్ కు బీమా పాలసీ తీసుకుంటారు. మరి రూ.30 లక్షలకు పైగా విలువ చేసే ఇల్లు లేదా ఇంట్లోని వస్తువులకు బీమా ఎందుకు తీసుకోరు ఏదైనా ప్రమాదం జరిగి ఇల్లు దెబ్బతిని, ఇంట్లోని విలువైన వస్తువులు బూడిదగా మారితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఆలోచించండి . నిజానికి మన దేశంలో ఇప్పటికీ చాలా మంది ఈ బీమా పాలసీని తీసుకోవడం లేదు. కేవలం 30లక్షల గృహాలకే ఈ బీమా కవరేజీ ఉంది. అనవసరం అనే భావనే ఇందుకు కారణం. వరదలు, దొంగతనాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ల కారణంగా ఇల్లు లేదా షాపు, వాటిలోని విలువైన వస్తువులకు భారీ నష్టం వాటిల్లుతుంది.

ఆ సమయంలో ఆదుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ ఉపకరిస్తుంది. 20 లక్షల రూపాయల కవరేజీ కేవలం వెయ్యి రూపాయలకే లభిస్తుంది. కనుక ఈ పాలసీ పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు.అయితే, ఈ పాలసీల్లో పరిమితులు కూడా ఉంటాయి. క్లెయిమ్ మొత్తంలో 5 శాతాన్ని కంపెనీలు పరిహారంగా ఇవ్వవు. ఇంట్లో ఉన్న నగదుకు కవరేజీ ఉండదు. ఆభరణాలు రూ.10వేల విలువ వరకు పరిహారం ఉంటుంది. అలా కాకుండా అన్నింటికీ పరిహారం కావాలంటే ప్రీమియం కూడా పెరుగుతుంది. అందుకే పాలసీ డాక్యుమెంట్ ను చూసి నిర్ణయం తీసుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *