అసలు రూపాయి ప్రయాణం ఎప్పుడు మొదలు అయిందో తెలుసా

మన దేశ కరెన్సీ రూపాయి అధిక విలువ కలిగిన నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో మరోసారి తక్కువ విలువ కలిగిన నోట్లు అమూల్యంగా మారిపోయాయి. మన రూపాయి ప్రయాణం గురించి తెలుసుకోవాలి అని చదువుతుంటే ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. వేలాది సంవత్సరాల చరిత్ర రూపాయికి సొంతం.ప్రపంచంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన కరెన్సీల్లో మన రూపాయి కూడా ఒకటి.

చరిత్రలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే రూపాయి జాడలు ఉన్నాయి అని తెలుస్తుంది . మౌర్యుల కాలంలో అర్థ శాస్త్రాన్ని రాసిన చాణక్యుడు (క్రీస్తుపూర్వం 340-290) వెండి కాయిన్లను రూప్యరౌప్య, బంగారు కాయిన్లను సువర్ణరూప్య, రాగి కాయిన్లను తామ్రరూప్యగా పేర్కొన్నారు. 6వ శతాబ్ధంలో (1540-1545) అఫ్ఘాన్ చక్రవర్తి సుల్తాన్ షేర్ షా సూరి తన ఐదేళ్ల తన పాలనా కాలంలో వెండి రూపియాను జారీ చేయగా ఆ తర్వాత మొఘల్ పాలకులు దీన్నే అనుసరించారు. ఆ తర్వాత రూపాయిగా మారింది. సంస్కృతంలో రూప్య అంటే రూపం. రౌప్య అంటే వెండి అని అర్థం. సుల్తాన్ షేర్ షా సూరి జారీ చేసిన వెండి కాయిన్ 11.53 గ్రాముల బరువు ఉండేది. కానీ రూపాయి పేపర్ నోట్లను మాత్రం తొలిగా బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్ 1770-1832 మధ్య, ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బిహార్ 1773-75 మధ్య, బెంగాల్ బ్యాంకు 1784-91 మధ్య విడుదల చేశాయి.

1938లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తొలిసారిగా రూ.1,000, రూ.10,000 నోట్లను కూడా విడుదల చేసింది. అయితే 1946 జనవరిలో డీమోనటైజేషన్ ప్రకటించేంత వరకు అవి చలామణిలో ఉన్నాయి. 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ఆచరణలోకి తీసుకోని వచ్చారు. వీటిని 1978లో రద్దు చేశారు కూడా . 2000 సంవత్సరంలో కొత్తగా వెయ్యి రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. అంతకంటే ముందు 1987 నుంచీ రూ.500 నోటు చలామణిలో ఉంది మరి.

వెండి కాయిన్లతో తగ్గిన విలువ భారత్ లో రూపీ తొలిగా వెండి కాయిన్ రూపంలో ఉండేది. అప్పట్లో ఆర్థికంగా బలమైన దేశాల కరెన్సీ బంగారు కాయిన్ల రూపంలో ఉన్నాయి అమెరికా మరియు యూరోప్ దేశాల్లో పెద్ద ఎత్తున వెండి నిల్వలు బయటపడడంతో బంగారంతో పోలిస్తే వెండి విలువ భారీగా తగ్గిపోయింది. దీంతో రూపాయి కాయిన్ విలువ కూడా తగ్గు ముఖం పట్టాయి . ఈ పరిస్థితుల నేపథ్యంలో 1825లో భారత్ లోని బ్రిటిష్ కాలనీల్లో పాలకులు స్టెర్లింగ్ ను అమల్లోకి తెచ్చారు.

1857లో భారత్ లో సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారత పాలనను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. బంగారు కాయిన్లను సిడ్నీలోని మింట్ లో తయారు చేయించింది. 1864లో బ్రిటిష్ బంగారు కాయిన్లను అమల్లోకి తీసుకొనిరావాలని ప్రయత్నించినా సాకారం కాలేదు. దాంతో అవి వాల్ట్ లలోనే ఉండిపోయాయి.

రూపాయికి పలు భాగాలు ఒక రూపాయికి వంద పైసలు అని తెలిసిందే. బ్రిటిష్ పాలనలో రూపాయి పలు ఉప విలువలతోనూ ఉండేది. ఒక రూపాయి అంటే 16 అణాలని అర్థం. ఇదే తర్వాత 100 నయా పైసలుగా మారింది. అర్ధ రూపాయి అంటే 8 అణాలు. ఒక పావలా నాలుగు అణాలకు సమానం. ఒక బేడా రెండు అణాలుగా ఉండేది. ఒక పరకా అర అణాతో సమానం. ఒక కాణి అణాలో పావు వంతు.


కరెన్సీ నోట్ల విడుదల బ్యాంకు ఆఫ్ బెంగాల్ తొలినాళ్లలో నోట్లను ప్రింట్ చేయించింది. ఒకవైపే ముద్రణతో రూ.100, రూ.250, రూ.500 విలువతో ఇవి ఉండేవి. బ్రిటిష్ ఇండియా 1861లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.1,000 నోట్లను విడుదల చేసింది. 1867లో రూ.500, రూ.10,000 నోట్లు కూడా వచ్చి చేరాయి. అయితే, 1935  ఏప్రిల్ 1 నుంచి రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆచరణలోకి వచ్చింది. 1938లో తొలిసారిగా రూ.5 నోటు విడుదల చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో వరుసగా రూ.10, రూ.100, రూ.1000, రూ.10,000 నోట్లను కూడా తీసుకొచ్చింది. వీటిపై అప్పటి గవర్నర్ జేమ్స్ టైలర్ సంతకం చేశారు. 1940 ఆగస్టులో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టారు.రూ.2 అంత కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను ముద్రించే అధికారం ఆర్ బీఐకి ఉంది. కానీ, రూపాయి ముద్రణ మాత్రం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది. అలాగే అన్ని డినామినేషన్ల కాయిన్ల ముద్రణాధికారం కూడా కేంద్రానిడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *