గుడిలో 8 ఏళ్ళ బాలికపై దారుణంగా అత్యాచారం కాపాడాల్సిన పోలీసులే చంపేశారు

మహిళలను గౌరవించే గొప్ప దేశం మనది ఇండియా అని గుండెలు పగిలేలా గొప్పగా చెప్పుకుంటున్నాం మనమంతా. కానీ 8 ఏళ్ళ చిన్నారిని అత్యంత దారుణంగా సుమారు 6 రోజుల పాటు నలుగురు ఒక గుడిలో బంధించి అత్యాచారం చేశారు. 4 రోజుల తర్వాత అమ్మాయికి స్పృహ రావడంతో రాళ్లతో, కర్రతో కొట్టి చంపేశారు. ఘోరాతి ఘోరమైన నిజం ఏమిటంటే కాపాడాల్సిన పోలీసులే ఇందులో నిందితులుగా ఉన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన ఈ నరరూప రాక్షసులను ఏం చేయాలో మీరే చెప్పండి.


మ్మూ సిటీకి 70 కిమీ దూరంలో ఉన్న రసనా అనే గ్రామంలో ముస్లింలలో గుల్జర్ సముదాయానికి చెందిన కుటుంబం వీరిది. గొర్రెలు, గుర్రాలు, బర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో హిందూ ప్రజలు ఎక్కువగా ఉంటారు. దాదాపు 3 నెలల క్రితం ఆసిఫా బానో అనే ఈ 8 ఏళ్ళ చిన్నారి అడవికి వెళ్లిన గుర్రాలను ఇంటికి తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లగా, సాయంత్రానికి గుర్రాలు ఇంటికి వచ్చాయి కానీ అమ్మాయి తిరిగిరాలేదు. ఊరు, అడవి మొత్తం వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు చెప్పారు. ఇద్దరు పోలీసులను అమ్మాయిని వెదికేందుకు నియమించారు అధికారులు. అత్యంత దారుణం ఏమిటంటే ఆ అమ్మాయిని రేప్ చేసిన ఒక పోలీస్ ఇందులో ఉండటమే.


అభం శుభం తెలియని ఈ చిన్నారికి మత్తుమందు ఇచ్చి అక్కడికి దగ్గరలోని గుడిలో బంధించి ఒక రిటైర్ట్డ్ రెవెన్యూ అధికారి, అతడి కొడుకు, మేనల్లుడు, మేనల్లుడి ఫ్రెండ్, ఒక ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. 4 రోజుల తర్వాత చిన్నారికి మెలకువ వస్తుందని గమనించి రాళ్లతో కర్రలతో కొట్టి చంపారు. చనిపోయిన శవంపై కూడా పోలీసులు అత్యాచారం చేశారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వీళ్ళను అరెస్ట్ చేయకూడదు వారికి న్యాయం చేయాలని కొందరు పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ చిన్నారి తల్లితండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. దేశం మొత్తం ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి బాధ పడుతున్నారు.


ఇంత నీచానికి పాల్పడిన ఈ దుర్మార్గులను ఏం చేయాలో మీరే చెప్పండి. మరో చిన్నారికి ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *