బ్యాంకు ఖాతాదారులు ముఖ్యంగా SBI కస్టమర్లు తెలుసుకోవాల్సిన గుండెలు పగిలే నిజం

ఖాతాల్లో కనీస నిల్వ లేదన్న సాకుతో బ్యాంకులు ఖాతాదారులను ఎడాపెడా బాదుతున్నాయి. రెగ్యులర్‌ బిజినె్‌సలో సంపాదించే లాభాలకంటే కూడా కొన్ని బ్యాంకులకు, ఇలా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న మొత్తాలే ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాంకులు హఠాత్తుగా ఇలా వడ్డనలకు దిగడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఖాతాల్లో కనీస నిల్వలేదన్న కారణంగా గతేడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య కాలంలో పిఎ్‌సయు (ప్రభుత్వం రంగబ్యాంకులు) ఇన్వెస్టర్ల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన పెనాల్టీల మొత్తం ఎంతో తెలుసా? 2,320 కోట్ల రూపాయలు. దిగ్గజ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బిఐ వాటా ఈ మొత్తంలో 1,771 కోట్ల రూపాయలుంది.


ఎస్‌బిఐ గతేడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సంపాదించిన నికర లాభం 1,581 కోట్ల రూపాయల కంటే, ఇలా పెనాల్టీల పేరుతో ఖాతాదారుల నుంచి దౌర్జన్యంగా కొట్టేసిన మొత్తమే ఎక్కువ. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, రిజర్వ్ బ్యాంకు అండతో దేశంలోని బ్యాంకులన్నీ చెలరేగి ఆడుతున్నాయి. అయిందానికి కాని దానికి ఫెనాల్టీలు, ఫీజులు వసూలు చేస్తూ ఖాతాదారుల జేబులు గుల్ల చేస్తున్నాయి.


డిజిటల్ లావాదేవీలు మాత్రమే చేయాలంటూ మోఢీ ప్రభుత్వం మొదలుపెట్టిన కొత్త స్తోత్రం బ్యాంకులకు వరంగా మారింది. బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్నో రకాల పన్నులు, ఫెనాల్టీలు ప్రవేశపెట్టారు. ఎప్పుడో ఆగిపోయిన మినిమమ్ బ్యాలెన్స్ కు ఫెనాల్టీ సిస్టాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు మళ్లీ తెరపైకి తెచ్చా యి. నిబంధనలకు అనుగుణంగా ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించకుంటే జరిమానాలు వేస్తున్నాయి. చార్జీలు వసూలు చేస్తున్నాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలకు మాత్రం ప్రస్తుతం ఈ చార్జీల నుంచి మినహాయింపు ఉంది. ఇక ఏ బ్యాంకు వాటా ఎంత అనే విషయానికి వస్తే.

కనీస నిల్వ నిబంధనల పేరుతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) పెనాల్టీల కింద సంపాదించిన లాభం ఏప్రిల్‌-నవంబరు కాలంలో 97.34 కోట్ల రూపాయలుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్జన 68.67 కోట్ల రూపాయలుండగా కెనరా బ్యాంకు సంపాదన 62.16 కోట్ల రూపాయలుంది. ఇక మినిమమ్ బ్యాలెన్సుల విషయానికి వస్తేఎస్‌బిఐ బ్యాంకు వివరణల ప్రకారం, మెట్రో నగరాల్లోని బ్యాంకు శాఖల్లో ఖాతాలున్నవారు కనీసం 5,000 రూపాయలు నిల్వ ఉంచాలని మొదట ప్రకటించారు. తర్వాత దీనిని 3,000 రూపాయలకు తగ్గించారు. అర్బన్‌ ఏరియాల్లోని బ్యాంకు శాఖల్లో 3,000 రూపాయల కనీస నిల్వ, సెమి అర్బన్‌ ఏరియాల్లో 2,000 రూపాయలు. గ్రామీణ ప్రాంత శాఖల్లో కనీసం 1,000 రూపాయల నిల్వ ఉండాలి.

పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఇలా ఉంచలేని వారికి ఎంత వడ్డిస్తున్నారో తెలుసా?..
ఎస్‌బిఐ ఈ మధ్యనే చార్జీలను పెంచింది. మెట్రో నగరాల్లో కనీస నిల్వకంటే సొమ్ము 75 శాతం పైగా తక్కువగా ఉంటే 100 రూపాయల పెనాల్టీ ప్లస్‌ సర్వీస్‌ టాక్స్‌ విధిస్తున్నారు. కనీస నిల్వకంటే 50 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం 50 రూపాయల వడ్డన ఆపై సర్వీస్‌ టాక్స్‌ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెనాల్టీ 20-25 రూపాయల మధ్యన ఉంది. బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలు ఇష్టారీతిన పెంచాయి. కనీస నిల్వకంటే తక్కువగా ఉన్న మొత్తంపై వార్షికంగా 78 శాతం వరకు చార్జీల కింద కొన్ని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *