ఏప్రిల్ 14న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ పెద్దిగారి ఫౌండేషన్‌, ట్రేడ్‌ హైదరాబాద్‌డాట్‌ కామ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉచిత మెగా అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ పెద్దిగారి సంతోషి తెలిపారు. దాదాపు 30కి పైగా సంస్థలు పాల్గొంటున్న ఈ ఉద్యోగ మేళాలో 3,500 వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హెరిటేజ్‌, రిలయెన్స్‌, పార్చ్యూన్‌, బటర్‌ ఫ్లై, రాజ్‌ గ్రూప్‌, పోట్రియా, అపోలో, శుభ గృహ, బిగ్‌ సీ మొబైల్స్‌, రెడాక్స్‌ ల్యాబరేటరీస్‌, టాటా స్ర్టైవ్‌, మినర్వా, ఐసీఐసీఐ బ్యాంకు, పేటీఎం, ఫార్ట్యూన్‌ ఇన్‌ఫ్రా తదితర సంస్థలు ఇందులో పాల్గొంటాయన్నారు.


7వ తరగతి మొదలుకుని ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఫార్మసీ, బీటెక్‌, ఏఎన్‌ఎం, నర్సింగ్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లమో చేసిన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. పూర్తి ఉచితం గా నిర్వహిస్తున్న ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు రూ.6,500నుంచి 42,000 రూపాయల వరకు వేతనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ మేళా 14న కార్వాన్‌లోని ఏకేఎం అండ్‌ ఎంకే గార్డెన్‌లో నిర్వహిస్తున్నామని, సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పెద్దిగారిఫౌండేషన్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో కానీ, ఫోన్‌ నెంబర్‌ 9121917342, 7337556150 నెంబర్‌లలో సంప్రదించొచ్చని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *