హార్ట్ ఎటాక్ అంటూ భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిస్తే షాక్..!

వివాహేతర సంబంధాలు తెలుగింటి కాపురాలను నిలువునా ముంచుతున్నాయి. మూడుముళ్లు బంధాన్ని నిట్ట నిలువునా తెంచేస్తున్నాయి. ఏడడుగుల బంధానికి ఉరిపెడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు భార్యలను భర్తలు చంపడం మాత్రమే మనకు తెలుసు.. కాని ఇప్పుడు మారిన కాలంలో భార్యలు భర్తలను అత్యంత కిరాతకంగా, దయనీంగా చంపేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చివరి మూడు నెలల కాలంలో 20 వరకు ఇటువంటి ఉదంతాలు జరిగాయంటే కొందరు పెళ్లాలు ఎంత వైలెంట్ గా మారిపోయారో ఇట్టే తెలిసిపోతుంది.

మొత్తానికి ప్రపంచమంతా వేనోళ్లా కీర్తించే మన వివాహ వ్యవస్థ అపహాస్యమవుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో శాశ్వత అనుబంధానికి ప్రయత్నించి మరో మహిళ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ భార్య హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.
హైదరాబాద్ బాలానగర్‌లో జరిగిన ఈ ఘటనలో నిందితులిద్దరూ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. విజయనగరం జిల్లా పనుకువలస గ్రామానికి చెందిన పెద్దింటి జగదీశ్వర్ రావుకు ఎనిమిదేళ్ల క్రితం అదే జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన తులసి అనే యువతితో వివాహామైంది. వీరికి ఇద్దరు కుమారులు.

కుటుంబంతో సహా ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి బాలానగర్‌లో జగదీశ్వర్ రావు స్థిరపడ్డాడు. స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న వీరబాబుతో జగదీశ్వర్ రావుకు పరిచయం కలిగింది. ఈ క్రమంలో వీరబాబు తరుచూ జగదీశ్వర్ ఇంటికి వస్తూ ఉండేవాడు. అదే సమయంలో వీరబాబుకు తులసి దగ్గరైంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబందం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్వర్ రావు పలు మార్లు భార్య తులసిని మందలించాడు.


ఈ నేపథ్యంలోనే భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి తులసి ఓ పథకం వేసింది. నాలుగు రోజుల క్రితం భర్త మధ్యాహ్న భోజనానికి వచ్చిన సమయంలో అతణ్ని చీరతో ఉరి వేసి హత్య చేశారు. విషయం బయటపడకూడదని భావించిన భార్య తులసి, ప్రియుడు వీరబాబు అతని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది హార్ట్ ఎటాక్ కాదు.. హత్య అని తేల్చిన డాక్టర్లు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్య తులసి, ప్రియుడు వీరబాబులను తమదైన స్టైల్లో విచారిస్తే.. అసలు విషయం బయటపెట్టారు. గతంలో ఇలాగే భర్తపై వ్యతిరేకత.. పరాయి మగాడిపై మోజుతో నాగర్ కర్నూల్‌కు చెందిన స్వాతి, రాచర్లకు చెందిన జ్యోతి, గుంటూరుకు చెందిన శ్రీవిద్య మర్డర్ ప్లాన్లు అమలు పరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *