ముత్తూట్, మణుప్పురంలో గోల్డ్ పెడితే గోవిందా తాకట్టుపెట్టే వారంతా తెలుసుకోవాల్సిన భయంకరమైన వాస్తవం

రూపాయే వడ్డీ, మూడు నిమిషాల్లో లోన్, గ్రాముకి రూ.2500… ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో బంగారం తాకట్టు వ్యాపారాన్ని ముత్తూట్, మణుప్పురం, ఇతరత్రా ఫైనాన్స్, గోల్డ్ లోన్ సంస్థలు తమవైపు తిప్పుకున్నాయి. బంగారం తాకట్టు పెట్టడమే ఆపద కాలానికి సంకేతం… అంటే ఎంత త్వరగా చేతిలో డబ్బు పడితే అంత తొందరగా మనసు కుదుట పడుతుంది. త్వరగా సమస్యల్లోంచి గట్టెక్కొచ్చు. అదే ఏ స్టేట్ బ్యాంకుకో, ఆంధ్రా బ్యాంకుకో వెళితే ఒక పూట అయినా పడుతుంది గోల్డ్ లోన్ ఇవ్వడానికి.. మళ్లీ తీయడానికి కూడా అంతే సమయం.. అందుకే తాము తాకట్టు పెట్టే బంగారం భద్రత విషయంలో ఎటువంటి భరోసా ఆలోచించకుండా లోన్లు తీసుకుంటుంటారు.


మరి అలాంటి కంపెనీనే అవకతవకలకు పాల్పడితే.. కుదువ పెట్టిన నగలతో ఏకంగా బ్రాంచ్ మేనేజరే బెట్టింగ్‌లో ష్యూరిటీకి పెట్టాడు. చిత్తూరు జిల్లా వి. కోట ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రకాశ్‌కు క్రికెట్‌లో బెట్టింగ్ కాసే వ్యసనం ఉంది. ఈ నేపథ్యంలో తన బ్రాంచ్‌లో కుదువబెట్టిన నగలను బెట్టింగ్‌లో పెట్టాడు. అయితే బెట్టింగ్‌లో ఓడిపోవడంతో నగలను కోల్పోయాడు. దీంతో ఖాతాదారులకు అనుమానం రాకుండా ఒరిజినల్ నగల స్థానంలో నకిలీ నగలను ఉంచాడు. నగలను విడిపించుకుందామని వచ్చిన ఖాతాదారుడికి అనుమానం వచ్చి పరిశీలించగా అవి గిల్టు నగలని తేలింది. దీంతో.


బ్రాంచ్ మేనేజర్‌పై పోలీసులకు సమాచారం అందించాడు. మనస్థాపం చెందిన మేనేజర్ ప్రకాష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆత్మహత్యా ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జీవితంలో క్రమశిక్షణ లేని వ్యక్తులు కొందర్ని తక్కువ జీతాలకు లభిస్తున్నారని ఆయా సంస్థలు ఉద్యోగంలో పెట్టుకుంటున్నాయి. తద్వారా చాలా బ్రాంచీల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇదిగో పైన చెప్పిన మాదిరగా కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *