కాబోయే భర్త పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భార్య ఎందుకో తెలిస్తే షాక్..!

సమాజంలో పద్దతిగా కుటుంబ సంప్రదాయాల మధ్య జరిగిన పెళ్లి సంబంధాలు, ప్రేమ సంబంధాలే ఎన్నో గొడవలతో ఆత్మహత్యలతో ముగుస్తున్నాయి.. అలాంటిది సమాజానికి విరుద్ధంగా వరుసవాయి లేకుండా సోదరుడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. చివరకు ఈ అనైతిక బంధమే మరోవ్యక్తి మరణానికి దారితీసింది.. కొద్దీ రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యాకయ్య ఫై వధువు పెట్రోల్ పోయడంతో 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


కాబోయే పెళ్లి కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో విస్తుగొలిపే విషయం వెలుగు చూసింది. ఈ దురాఘాతానికి పాల్పడింది వధువుకు స్వయంగా పెద్దమ్మ కొడుకేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అన్నాచెల్లెలి మధ్య కొనసాగుతున్న అనైతిక బంధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వారి విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. జనగామ జిల్లా కంచనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి గొంగళ్ల యాకయ్య అనే యువకుడిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి కీలకాధారాలను రాబట్టినట్లు తెలిసింది.అయితే వరుడు యాకయ్య కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి ఇంట్లో బంధువులతో ఉన్నాడు.. కాబోయే భార్య అరుణ… యాకయ్య కు ఫోన్ చేసి బయటకు రావాలని కోరగాగా యాకయ్య బయటకు వచ్చాడు.. దీంతో బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను చికిత్స పొందుతూ మృతి చెందాడు.


వధువు కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు యాకయ్యకు ఆమె ఎప్పుడు ఫోన్‌ చేసింది? అంతకు ముందు ఫోన్‌ ఎవరితో మాట్లాడింది ? అనే వివరాలను సేకరించారు. యాకయ్యకు ఫోన్‌ చేయక ముందు ఆమె కాల్‌ చేసిన వ్యక్తి ఆమె పెద్దమ్మ కొడుకుగా గుర్తించారు. రాత్రి 11.45 గంటలకు ఐదు సార్లు యాకయ్యతో ఎందుకు మాట్లాడావు.. ఏం మాట్లాడావు, బయటకు ఎందుకు రమ్మన్నావు ? అని పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో తాను, తన పెద్దమ్మ కుమారుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆ యువతి వెల్లడించినట్లు తెలిసింది. తాము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే యాకయ్యను హతమార్చేందుకు ప్లాన్‌ చేసినట్లు ఇరువురు అంగీకరించినట్లు సమాచారం. వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.. ఈ పాడు కాలంలో ఇంతకంటే దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందో కదా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *