బింకీ కల్లు కాదు… బొంగు చికెన్ తరహాలోనే… బొంగు కల్లు…!

మారేడుమిల్లి పోయేవాళ్లకు… పాపికొండలు టూర్ వెళ్లేవాళ్లకు బొంగు చికెన్ పరిచయమే… కల్లుతో గానీ, మందుతో గానీ స్నాక్స్‌గా… లేదా దేంట్లోనైనా కలుపుకొని తింటుంటారు… నూనె గట్రా లేకుండా, మసాలా కూరిన చికెన్ ముక్కల్ని ఓ వెదురుబొంగులో దూర్చి, దాన్ని మూసేసి, కట్టెల మీద కాల్చడమే బొంగు చికెన్… అదొక వెరయిటీ… కొందరు కల్లు పోసి చికెన్ వండుతారు… అదో వెరయిటీ… అలాగే మరి కల్లు..? తాటి కల్లు, ఈత కల్లు… పోతుదాటి (పోద్దాటి) కలు, పండుతాడి కల్లు… ఇవి సరే… ఇంకా..? సేమ్, బొంగు చికెన్‌లాగే వెదురు బొంగులోకి కల్లును సేకరిస్తే అది కంక బొంగు కల్లు.

దీనిపై సాక్షి జిల్లా టాబ్లాయిడ్‌లో వచ్చిన ఓ వార్త కల్లు ప్రియులకు ఇంట్రస్టింగే.,. వైజాగ్ సమీపంలోని అరకు, భద్రాచలం సమీపంలోని పాపికొండల ప్రాంతాల్లో ఆదివాసీలు ఇలాగే కల్లు సేకరిస్తుంటారు… మొన్నటి మేడారం జాతరకు వెళ్లిన పర్యాటకులకు గొత్తికోయలు ఇలా తాడి చెట్లకు మట్టికుండలకు బదులు వెదురు బొంగులు కట్టి, కల్లును సేకరించి అమ్మారు… ఇదో వెరయిటీ.


సాధారణంగా తాడి చెట్లకు గానీ, ఈత చెట్లకు గానీ మట్టితో చేసిన బింకీలు కట్టి కల్లు సేకరిస్తారు కదా… ఈ ఆదివాసీ విధానంలో బింకీలకు బదులు వెదురు బొంగులే నేరుగా చెట్లకు కడతారు… ఫోటో చూడండి… చత్తీస్‌గఢ్ నుంచి చాలామంది గొత్తికోయలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర పాత జిల్లాల్లోని గోదావరి నదీపరిసరాలు, అటవీ ప్రాంతాల్లోకి వచ్చారు తెలుసు కదా… వాళ్లు సేకరిస్తున్నారు ఇలా కల్లు… మేడారం వెళ్లే వెంకటాపురం, మొట్లగూడెం, ప్రాజెక్టునగర్ తదితర ప్రాంతాల్లో ఈ కల్లు ఈమధ్య పాపులర్ అయిపోయింది… అయితే మామూలుగా రెండు లీటర్ల బింకీ కల్లుకు 100 తీసుకుంటే, ఈ బొంగు కల్లుకు డబుల్ రేటు 200 తీసుకుంటారు.

కానీ జనానికి వెరయిటీ కావాలి కదా… ఎగబడుతున్నారు… మట్టి కుండలో సేకరిస్తేనేం..? వెదురుబొంగులో సేకరిస్తేనేం… టేస్టులో తేడా ఏముంది అంటారా..? ఏమో, ఇలాగయితే సాఫ్ట్‌గా ఉంటున్నదట కల్లు… ‘‘ఖాళీగా కల్లు గీయకుండా వదిలేసిన చెట్లను గుర్తించి, గ్రామస్థులతో మాట్లాడుకుని ఇలా కల్లు సేకరిస్తున్నాం… చత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాల్లో ఇలా సేకరించడం అలవాటే…’’ అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *