అమలాపాల్ తీవ్ర ఆవేదన.. పోలీసులకు ఫిర్యాదు మహిళలకు సమాజంలో భద్రత లేదు..!

ప్రముఖ నటి, మలయాళ భామ అమలాపాల్‌‌కు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అలగేశన్ తనను లైంగికంగా వేధించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెన్నైలోని మంబళం పోలీసు స్టేషన్‌కు చేరుకొని కంప్లైంట్ ఫైల్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అలగేశన్‌‌ను అరెస్టు చేసినట్లు సమాచారం.


టీనగర్‌కు చెందిన వ్యాపారవేత్త అలగేశన్.. అమలాపాల్‌తో అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తన లైంగిక కోరిక తీరిస్తే.. ఎంత డబ్బైనా ఇస్తానని అతడు అమలాపాల్‌ను నేరుగా అడిగినట్లు సమాచారం. ఊహించని పరిణామంతో తీవ్రంగా కలత చెందిన నటి.. పోలీసులను ఆశ్రయించింది. గతంలో విజయ్ అనే నిర్మాతను పెళ్లి చేసుకున్న అమలాపాల్.. అతడి కుటుంబసభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కేసు పెట్టి విడాకులు తీసుకుంది.


సినీ రంగంలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కారు కొనుగోలుకు సంబంధించి కేరళలో పన్నుల ఎగవేత కేసు ఎదుర్కొంటున్న అమలాపాల్‌కు తాజా పరిణామం కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల పట్ల అమలాపాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలకు సమాజంలో భద్రత లేదని పేర్కొంది. తనను వేధించిన అలగేశన్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *