రియల్ హీరో అంటే లారెన్స్ అని మళ్ళీ నిరూపించుకున్నారు.. చనిపోయిన అభిమాని కుటుంబానికి ఇల్లు కట్టించాడు.

రియల్ హీరో అంటే లారెన్స్ అని మళ్ళీ నిరూపించుకున్నారు.. చనిపోయిన అభిమాని కుటుంబానికి ఇల్లు కట్టించాడు.నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా మ‌ల్టీ టాలెంట్‌తో ఉన్న‌త స్థాయిలో ఉన్న‌ లారెన్స్ కేవ‌లం సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు తాను అండగా ఉన్నాననే భరోసా ఇస్తుంటాడు . ఆ మ‌ధ్య‌ ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు.

ఇక‌ ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పటివరకు 142 మంది చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. రీసెంట్‌గా త‌న‌తో ఫొటో దిగే క్ర‌మంలో అభిమాని మృతి చెంద‌డంతో ఇక‌పై త‌న కోసం అభిమానులెవ‌రు రావొద్ద‌ని, వీలు చూసుకొని నేనే మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాన‌ని చెప్పి అందరి మ‌న్న‌న‌లు గెలుచుకున్నాడు లారెన్స్. ఆ మ‌ధ్య జ‌ల్లిక‌ట్టు పోరాటంలో ఓ అభిమాని మ‌ర‌ణించ‌గా, ఆయ‌న‌ ఇంటికి వెళ్ళి ద‌హాన కార్య‌క్ర‌మాలు ద‌గ్గ‌రుండి చేయించాడు లారెన్స్‌. ఆ స‌మ‌యంలో వారి కుటంబానికి తాను అండ‌గా ఉంటాన‌ని మాటిచ్చాడు. అన్న‌ట్టుగానే అది నిలుపుకున్నారు.

తాను ఇచ్చిన మాట‌కి క‌ట్టుబ‌డి ఉన్నాన‌నే విష‌యాన్ని లారెన్స్ ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. అయితే ఇది సాయం కాదు నా కర్తవ్యం అని అన్నారు. గత ఏడాది చాలా మంది యువత, సామాన్య జనం కారణంగా మనం జల్లికట్టును గెలుచుకున్నాం. ఈ పోరాటంలో యోగేశ్వర్‌‌ను మనం కోల్పోయాం. అతని దహన కార్యక్రమాలకు నేను హాజరయ్యాను. చాలా బాధగా అనిపించింది. జల్లికట్టు సాధన ఎంత ముఖ్యమో.. యోగేశ్వర్ వాళ్ల ఫ్యామిలీని సంతోషంగా ఉంచడం కూడా మన కర్తవ్యం.

అతని దహన సంస్కారాల సమయంలో ఆ కుటుంబానికి యోగేశ్వర్ ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ చేస్తానని అతని తల్లికి అప్ప‌ట్లో ప్రామిస్ చేశాను. ఆమె కొడుకు ప్లేస్‌ని నేను భర్తీ చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు వారి ఇంటి గృహ‌ప్ర‌వేశం. ఇది నేను సాయం అనుకోవ‌డం లేదు. బాధ్య‌త‌గా ఫీల‌వుతున్నాను. మీ అందరి దీవెనలు, సపోర్ట్ నాకు ఎప్ప‌టికి కావాలి అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *