పిల్లల స్కూల్ బ్యాగులలో చెక్ చేస్తే పోర్న్ బుక్స్, గుట్కా ప్యాకెట్, , సిగరెట్, రేజర్, షేవింగ్ ఫోమ్,నీళ్లసీసాలో వోడ్కా..!!

ఎక్కడో అమెరికాలో ఏదో స్కూల్‌లో పిల్లాడు బ్యాగులో నుంచి తుపాకీ తీసి ఠపీఠపీమంటూ అందర్నీ కాల్చేస్తుంటే ‘వార్నీ, అదేం అమెరికారా బాబూ’ అని మస్తు విస్తుపోయాం కండోమ్స్, డ్రగ్స్ అక్కడ స్కూలు పిల్లలకు కామన్ అయిపోయాయని తెలిసి అయ్యో అయ్యో అని గుండెలు బాదేసుకున్నాం కానీ మనమెంత ఉన్నతంగా ఉన్నాం..? మనమూ అమెరికా స్థాయికి వేగంగా ఎదుగుతున్నాం త్వరలోనే దాటేస్తామేమో కూడా నిష్టురంగా ఉందా..? అక్కర్లేదు, పలు సంఘటనలు దాన్నే నిరూపిస్తున్నాయి.


పోర్న్ మ్యాగజిన్ , గుట్కా ప్యాకెట్ , హుక్కా పెన్ , సిగరెట్ , సిగరెట్ లైటర్ , రేజర్ , ట్రిమ్మర్, షేవింగ్ ఫోమ్  లక్నో లో పిల్లల స్కూల్ బాగ్ చెక్ చేస్తే బయట పడిన వస్తువుల లిస్ట్  మొన్న లక్నో లో ఒక స్కూల్ లో ఆరవ తరగతి అమ్మాయి సెలవు వస్తుందని ఒకటవ తరగతి అబ్బాయి ని స్కూల్ టాయిలెట్ లో పొడిచిన సంఘటన నేపథ్యం లో స్కూల్స్ పిల్లల బాగ్స్ చెక్ చేయడం మొదలు పెట్టాయి .

అప్పుడు బయట పడిన వస్తువులు ఇవి . ఏదైనా ఒక సంఘటన జరిగిన వెంటనే అది జరగడానికి కారణం ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని ప్రభుత్వాలు కానీ మీడియా కానీ ఆలోచించరు. వెంటనే ప్రైవేట్ స్కూల్స్ ను నిందించడం ఒక ట్రెండ్ గ మారింది . ప్రైవేట్ స్కూల్స్ సరైన దారిలో వెళుతున్నాయని నేను అనడం లేదు . తప్పకుండా అక్కడ ఉన్న లోపాలను సరిదిద్దాల్సిందే . చర్య లు తీసుకోవాల్సిందే . కానీ లోపం అక్కడే కాదు కదా  సమస్య కు ఇంకా చాల కారణాలు వున్నాయి.

టీవీ లు , సినిమా లు ఏమైనా చూపించ వచ్చు . పిల్లల మనసు ను కాలుష్యం చేయవచ్చు . ఇంటర్నెట్ పైన కనీస నియంత్రణ లేదు . పోర్న్ , వయోలెన్స్ పిలల్లకు యథేచ్ఛగా అందుబాటు లో వుంది . తల్లి తండ్రులకు కు  అంటే అందరు తల్లితండ్రులు కాదు లెండి . మంచి స్కూల్ వున్నట్టే , మంచి తల్లి తండ్రులు , మంచి టీవీ లు వున్నాయి , కానీ వాటి సంఖ్య తక్కువ . మనం మాట్లాడుకునేది అధిక శాతం గురించి .. నేటి ట్రెండ్ గురించి  పిల్లల తో గడిపే సమయం లేదు. పిల్ల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు . అన్ని అంటురోగాలు దోమ లాగా ఈగే లాగా అది నట్టింట్లోకి తెస్తోంది.

ఒక్క సారి ఆలోచించండి . పోర్న్ మ్యాగజిన్ , సిగరెట్ , గుట్కా ప్యాకెట్ పిల్లల బాగ్ లోకి ఎలా వస్తున్నాయి ? పిల్లలు వాటర్ బాటిల్ లో వోడ్కా కలుపుకొని స్కూల్ కు ఎలా తీసుకొని రాగలుగుతున్నారు ? స్కూల్ ప్రాంగణం దాకా డ్రగ్స్ ఎలా వస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *