9 మంది బెస్ట్ ఫ్రెండ్స్.. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా తామున్నామంటూ ముందుండేవారు. రోడ్డు ప్ర‌మాదంలో అందరు చనిపోయారు..!!

ఆ యువ‌కులంద‌రూ ఒకే గ్రామానికి చెందిన‌వారు. దాదాపు అంద‌రి వ‌య‌స్సూ ఒక్క‌టే. 20-23 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న యువ‌కులు. ఊళ్లో వారికి చాలా మంచి పేరు ఉంది. ఎక్క‌డికి వెళ్లినా క‌లిసి వెళ్లేవారు. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా తామున్నామంటూ ముందుండేవారు. రెండురోజుల కింద‌ట చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్ర‌మాదంలో ఆ తొమ్మిది మందీ మృత్యువాత ప‌డ్డారు. ఏ ఒక్కరూ మిగ‌ల్లేదు.


ఈ స‌మాచారం.. వారి గ్రామం మొత్తాన్నీ విషాదంలో ముంచెత్తింది. మృత‌దేహాల‌కు నిర్వ‌హించిన అంతిమ‌యాత్ర‌లో ఊరు ఊరంతా పాల్గొంది. అంతిమ వీడ్కోలు ప‌లికింది.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని క‌ఛ్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జెత్‌పూర్ గ్రామానికి చెందిన ఆ తొమ్మిదిమంది మిత్రులు క‌లిసి వెళ్తోన్న మారుతి ఈకో వ్యాన్ ప్ర‌మాదానికి గురైంది.


వారు ప్ర‌యాణిస్తోన్న వాహ‌నాన్ని మినీ బ‌స్సు ఢీ కొట్టింది. భుజ్‌కు 23 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లోహియా వ‌ద్ద సంభ‌వించిన ఈ ప్ర‌మాదంలో వారంద‌రూ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

ఈ స‌మాచారం తెలిసిన వెంట‌నే జెత్‌పూర్ ప్ర‌జ‌లు విషాదంలో మునిగిపోయారు. వారి అంతిమ‌యాత్రలో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొన్నారు. నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *