వేప చెట్టు నుంచి ధారా పాతంగా పాలు కారుతున్నాయి.అవి తాగితే సర్వ రోగాలు నయమవుతున్నాయి..!!

మహా మహా మందులకంటే ప్రజల్లోని మానసిక స్థయిర్యం, ఆత్మవిశ్వాసం వల్లనే చాలా మందులు నయమవుతాయని పెద్ద పెద్ద చదువులు చదివిన వైద్యులు సైతం చెబుతుంటారు. శారీరక రుగ్మతలకు సైతం మానసిక మనోనిబ్బరం, ధైర్యం మందుగా పనిచేస్తుందని అంటారు. అందుకేనేమో ఏ చెట్టుకో పుట్టకో మొక్కుకుని గుండె ధిటవు చేసుకుని ఇంట్లోనే కూర్చుని అనేక రోగాలు నయం చేసుకుంటుంటారు. అందుకే ప్రతి ఊరిలోనూ భూత వైద్యులు, తాంత్రిక నిపుణులు, దేవుళ్లమ్మలు మనకు కనిపిస్తారు.

అదిగ్గో సరిగ్గా అలాంటిదే ఇది కూడా.. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఓ వేప చెట్టు నుంచి ధారాపాతంగా పాలు కారుతుండటం, ఈ పాలను తాగితే రోగాలు నయమవుతున్నాయని ప్రజలు భావిస్తుండటంతో, ఆ చెట్టున్న ప్రాంతమంతా ఇప్పుడో చిన్నపాటి పుణ్యక్షేత్రమైంది.ఫిరోజాబాద్ లోని నసీర్ పూర్ సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి చిక్కగా పాల వంటి ద్రవం కారుతోంది.

ఇది సర్వరోగాలనూ హరించే ద్రవమని నమ్ముతున్న ప్రజలు, తండోపతండాలుగా వస్తున్నారు. పాలు పట్టుకుని వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతమంతా భజనలు మారుమ్రోగుతుండగా, వందలాది మంది ఇది దేవుని మహిమేనంటూ, చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు.


కాగా, దీనిపై ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ విష్ణో యాదవ్ స్పందిస్తూ, ప్రజలు గుడ్డినమ్మకంతో భగవంతుని మహిమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వేపలో సహజంగానే యాంటీ బాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందని, అందువల్లే ఈ పాలు తాగిన తరువాత చిన్న చిన్న వ్యాధులు, నొప్పులు తగ్గుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *