భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య ఆడిన నాటకం చూస్తే పెళ్లి అంటే పరుగు పెడతారు. ప్రతి మగడు చుడండి

భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య ఆడిన నాటకం చూస్తే పెళ్లి అంటే పరుగు పెడతారు. ప్రతి మగడు చుడండి..అసలు జరిగిందేమిటో చెప్పమ్మా అంటూ బెంగళూరు బ్యాటరాయనపుర ఠాణా పోలీసులు ఎంత ఓదార్చినా ఆమె ఆగలేదు. పెళ్లైన మూడు నెలలకే ఆమె జీవితం దారుణంగా మారింది. చీర కొంగు నోట్లో కుక్కుకని ఆమె వెక్కివెక్కి ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరమూ కాలేదు. చివరికి ఎలాగోలా నోరు తెరచి కష్టాన్నంతా వెళ్లగక్కింది. అయిపోయింది సార్‌.. అంతా అయిపోయింది. నేను అత్తగారింట్లో ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు దుండగులు నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చారు అంటూ ఆమె కన్నీరు పెట్టడంతో అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

మైసూరు మార్గంలోని బ్యాటరాయనపుర ఠాణా సిబ్బంది ఈనెల 6న 20 సంవత్సరాల యువతి చెప్పిన మాటలకు నిర్ఘాంత పోయారు. మూడు నెలల కిందటే మా పెళ్లి జరిగింది. ఐదో తేదీ ఉదయం టింబర్‌ యార్డు లేఔట్‌ ఓ గార్మెంట్‌ కంపెనీ ముందు నడిచి వెళుతుంటే ఓ కారు వచ్చి ఆగింది. ఏదో చిరునామా అడుగుతున్నారని అనుకుని నేనూ మాట్లాడాను. ఆ కారులోని వ్యక్తికి బదులిస్తుంటే.. వెనుకగా ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను బలవంతంగా ఆ వాహనంలోకి నెట్టారు.

నోరు మూసేసి.. చేతులు కట్టేసి రోజంతా ఎక్కడెక్కడో తిప్పారు. కారులోనే నలుగురూ.. ఒకరి తరువాత ఒకరు నాపై పశువుల్లా దాడి చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. నగలన్నీ దోచుకుని.. రాత్రి ఎనిమిది గంటలకు కళాసీపాళ్య బస్టాండు వద్ద వదిలేశారు. నేనిపుడు ఇంటికి ఎలా వెళ్లాలి? మా ఆయనతో ఇక కాపురం ఎలా చేసేది? నా బతుకు బుగ్గి చేశారు.అంటూ కుప్పకూలింది. ఆమె కష్టం రక్షకులను కదిలించి వేసింది.


ఆగమేఘాలపై ఉన్నతాధికారులూ రంగంలోకి దిగారు. వేర్వేరు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ముందుజాగ్రత్తగా ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. అవసరమైన సేవలు చేయడానికి పురమాయించారు. మహిళా వైద్యులు వెంటనే ఆమెను పరీక్షించారు. ఆసక్తికరంగా.. ఆమె గడచిన నెల రోజులుగా లైంగిక క్రియలో పాల్గొన లేదన్న వాస్తవం తేలింది. ఇదే విషయాన్ని రక్షకులకు వైద్యులు వివరించారు.

మరోవైపు.. రంగంలోకి దిగిన రక్షక బృందాలు కీలక విషయాన్ని సేకరించాయి. ఆమె కిడ్నాప్‌నకు గురైనట్లు చెబుతున్న టింబరు యార్డు వద్ద.. చివరిగా ఆమెను వదలివెళ్లిన కళాసిపాళ్య బస్టాండు సమీప సీసీ కెమేరాలను తనిఖీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక ఘటనలకు ఊతమిచ్చే దృశ్యాలు కనిపించలేదు. ఆమె జాడ వాటిలో లేనేలేదు. ఎక్కడో తేడా.. ఏదో తప్పుజరిగింది. రక్షకులు శంకించారు. ఆమెను గట్టిగా నిలదీశారు. చివరికి మహిళా రక్షకభటులు తమదైన శైలి లో ప్రశ్నించడంతో.. ఇక ఆపండి.. అంతా చెప్పేస్తానంటూ అసలు కథ చెప్పడం మొదలెట్టింది.


నాకు మొగుడంటే ఇష్టం లేదు. పెళ్లికి ముందే సురేష్‌ను ప్రేమించాను. పెళ్లి చేసుకోకుండా పెద్దలు అడ్డుపడ్డారు. ఇదిగో.. ఈ మొగుడినిచ్చి కట్టబెట్టారు. మూడు నెలల నుంచి ముళ్లమీద నడకలా కాపురం చేస్తున్నా. నాపై సామూహిక అత్యాచారం చేశారని చెబితే మొగుడు వదిలేస్తాడు. సురేష్‌తో కలసి హాయిగా కాలం గడపొచ్చని ఓ స్నేహితురాలితో కలసి పథకం రచించా. నిజానికి నా సొమ్ములన్నీ ఆ స్నేహితురాలి వద్ద దాచి.. ఈ నాటకం ఆడా.. అంటూ నోరుతెరవడంతో అమ్మదొంగా.. అంటూ ముక్కున వేలేసుకోవడం పోలీసుల వంతైంది. రెండు వైపులా కుటుంబాల వారిని పిలిపించి.. మంచిమాటలు చెప్పి.. బుద్ధిగా కాపురం చేసుకో అంటూ హెచ్చరించి పంపారు. పుర్రెకో విచిత్రబుద్ధి.. అని పెద్దలు ఊరికే అనలేదు మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *