చిన్ననాటి స్నేహం.. చివరకు ఇద్దరూ కలిసి ఒకే భర్తను పెళ్ళిచేసుకునేంతలా..!!

ఒకమ్మాయి పెళ్లి చేసుకుంది… కానీ తనతో చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి తిరిగిన తన ఆత్మీయురాలు, కజిన్, స్నేహితురాలిని విడిచి ఉండలేకపోయింది… ఒకే ఊరు, ఒక బడిలో చదువు, ఒకే వీథిలో ఆటలు పాటలు… తనకు పెళ్లి కాగానే దూరమైంది… మనసుకు కష్టంగా ఉంది… మరేం చేద్దాం..? ఇదీ ఆమె బాధ… భర్తతోనే నేరుగా చెప్పింది… మేం జీవితాంతం కలిసే ఉంటామని అనుకున్నాం, మరేం చేయమంటావూ అని…! నువ్వే చెప్పు ఏం చేద్దామో అనడిగాడు భర్త… ఆమె సందేహిస్తూనే, కాస్త తటపటాయిస్తూ ఆమెను కూడా పెళ్లిచేసుకో, ఒకే ఇంట్లో ఉంటాం, చిన్నప్పటి నుంచీ ఎలా పెరిగామో, ఇక ముందూ అలాగే ఉంటాం అన్నది… ముందు భర్త షాక్ తిన్నాడు… ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది అనడిగాడు తటపటాయిస్తూ… నేను ఒప్పిస్తాను అన్నది ఆమె… తన స్నేహితురాలితో మాట్లాడింది… ఆమె కూడా రెడీ అన్నది… ఇతన్ని రెండో భార్యగా వచ్చేసింది.


ఏందీ ఇది..? సినిమా కథ అనుకున్నారా..? కాదు, నిజమైన వార్తే… అదీ పాకిస్తాన్‌లో జరిగింది… ముల్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు ఆ దేశంలో బాగా వైరల్ అవుతున్నది… ఆ వరుడి పేరు ఫరాజ్… మొదట తనను చేసుకున్నామె పేరు అలినా… ఇప్పుడు తన రెండో భార్యగా వచ్చినామె పేరు అలిషా… చూశారుగా వాళ్లు చిన్నప్పటి పెంచుకున్న స్నేహం చివరకు ఒకే భర్తను పంచుకునేలా చేసింది… అవును అలినా ఏం చెప్పినా అలిషా కాదనదు… అలిషా కోసం అలినా ఏమైనా చేయగలదు… ఇంట్రస్టింగుగా ఉంది కదా…

www.fullhdwallpapers.in

ఏమ్మా, ఏమిటీ పని అని సమా టీవీ ప్రతినిధి అడిగితే, అవును మరి, తను లేకుండా నేను ఉండలేను, అందుకే ఇలా చేశాను అని కుండబద్ధలు కొట్టేసినట్టు సమాధానం చెప్పింది అలినా… నిజానికి ఈ ముగ్గురూ ఇష్టపడ్డారు… ఎవరికీ చింత లేదు, తప్పు చేశామనే భావనే లేదు… కానీ సమాజానికి, ఆ భార్యల పేరెంట్స్‌కు మాత్రం ఏమీ నచ్చలేదు… ‘ఒరేయ్, నిన్ను చంపేస్తాం’ అంటూ బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి… ‘అరె, ఊర్కొండి పెద్దలూ… ఇద్దరు భార్యలు ఉంటే తప్పేమిటి..? వాళ్ల ప్రైవేటు వ్యవహారంలో వేలు పెట్టి ఎందుకు కెలుకుతారు..? వాళ్ల జీవితాలు వాళ్లిష్టం…’ అని సమర్థించేవాళ్లు కూడా ఉన్నారు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *