20లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగులు ఆల్ ద బెస్ట్.. అందరికి షేర్ చేయండి

చాల మంది యువకులకు సరిగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు..కానీ రాబోయేది ఉద్యోగకాలం. నిరుద్యోగులకు హ్యాపీ డేస్ అంటోంది టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్, టీమ్ లీజ్ సర్వీస్ ఏజెన్సీలు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు పుట్టుకురానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కొత్త సర్వీస్ ప్రొవైడర్లు, డేటా విస్తరణలోనే అధికంగా ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పటికే జియో దేశవ్యాప్తంగా 30వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతోంది. మొబైల్ రంగం భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తుందని.. నిరుద్యోగులకు ఇది శుభపరిణామం అంటున్నారు.


మొబైల్ తయారీ రంగంలో వచ్చే ఉద్యోగాలు 10.76 లక్షలు
సర్వీస్ ప్రొవైడర్ల రంగంలో 3.70 లక్షలు
మౌలిక సదుపాయాల రంగంలో 6 నుంచి ఏడు లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు వెల్లడించాయి ఏజెన్సీలు
ఇన్ని ఉద్యోగాలకు నిపుణుల కొరత తీవ్రంగా ఉందని కూడా చెబుతున్నారు టీమ్ లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ శర్మ. స్మార్ట్ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావటం.. టెలికాం కంపెనీల నెట్ వర్క్ విస్తరణ, డిజిటల్ లావాదేవీలపై లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు.


వీళ్లకు జాక్ పాట్ :
ఇంటర్నెట్ టెక్నాలజీ, టెలికాం ఇన్ ఫ్రాస్ట్రక్చర్, నెట్ వర్క్ ఇంజనీర్, సేల్స్, సైబర్ సెక్యూరిటీ, టెస్టింగ్, అప్లికేషన్ డెవలపర్స్, సిస్ట్ ఇంజనీర్స్, ఐ-డాస్ ఇంజనీర్స్, హ్యాండ్ సెట్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్స్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటీవ్స్, బ్యాక్ ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్, రిపేర్ ఎగ్జిక్యూటీవ్స్ అర్హత ఉన్నవాళ్లకు ఈ ఏడాదిలోనే కంపెనీలు పిలిచి ఉద్యోగాలు ఇస్తాయని టీమ్ లీజ్ సర్వీసెస్ చెబుతోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా ఉద్యోగాలని.. వీళ్లపై ఆధారపడి పరోక్షంగా ట్రావెలింగ్, ఇతర సర్వీసుల కింద లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. నిరుద్యోగులు ఆల్ ద బెస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *