స్త్రీల కోసం ఫిమేల్ వయాగ్రా…త్వరలో మార్కెట్లోకి రానున్నానది..!!

లైంగిక ప్రేరణ, ఉత్తేజం, సంతృప్తి పొందే హక్కు పురుషులతో సమానంగా స్త్రీలకూ ఉంది. అయితే ఈ విషయంలో జరిగిన పరిశోధన తక్కువే. ఈ లోటును పూరిస్తూ మహిళల కోసం ఓ ‘ఫిమేల్‌ వయాగ్రా’ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ‘యడై’ అనే ఈ సంచలనాత్మక ఫిమేల్‌ సెక్స్‌ డ్రగ్‌ సామర్ధ్యం, సౌలభ్యం గురించి సెక్సాలజిస్ట్‌, సైకో అనలిస్ట్‌ డాక్టర్‌ షర్మిల మజుందార్‌ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.


తలనొప్పి మాత్రలా యడై అవసరమున్న ప్రతి మహిళా వాడే వీలు లేదు. ఈ మందు ప్రత్యేకంగా ఒక వర్గం స్త్రీలనుద్దేశించి తయారైంది. ఇతరత్రా ఎటువంటి ఆరోగ్యపరమైన, మానసికపరమైన సమస్యలు లేకుండా మెనోపాజ్‌కు చేరువలో ఉండి హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌తో బాధపడే మహిళలు మాత్రమే ఈ మందు వాడటానికి అర్హులు.

లైంగిక కోరికలు హరించిపోవటానికి లేదా లేకపోవటానికి ఎన్నో కారణాలుంటాయి. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల లేదా అకారణంగా సెక్స్‌ పట్ల ఉదాసీనంగా ఉండే స్త్రీలు ‘యడై’ వాడటానికి అభ్యంతరం లేని కోవ కిందకు వస్తారు. ఆ హెచ్‌ఎ్‌సడిడి కోవ కిందకు వచ్చే అంశాలు స్థూలంగా…
నిర్భంధపూరిత పెంపకం సెక్స్‌ అనేది పాపం అనే వాతావరణంలో పెరిగిన పిల్లలు…సెక్స్‌ పట్ల ఏమాత్రం అవగాహన లేకపోవటం…బలత్కారానికి గురవటం మూలంగా సెక్స్‌ను అసహ్యించుకోవటం.

ఈ కారణాలతో హోపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌కు గురయ్యే స్త్రీలలో సహజంగానే లైంగికాసక్తి లోపిస్తుంది. ప్రీ మెనోపాజల్‌ దశకు చేరుకున్న ఈ వర్గానికి చెందిన స్త్రీలు మాత్రమే యడై వాడటానికి అర్హులు.

యడై వాడకం వయాగ్రాను లైంగిక చర్యకు ముందు మాత్రమే తీసుకోవాల్సి ఉంటే యడైను ప్రతి రాత్రి రోజుకో టాబ్లెట్‌ చొప్పున 8 నుంచి 24 వారాలపాటు వాడాల్సి ఉంటుంది. మూడో ప్రయత్నంలో విజయం స్త్రీల లైంగిక కోరికల్ని పెంచే మందుల మీద పరిశోధన నాలుగేళ్లుగా సాగుతోంది. ఆ ప్రయోగాల ఫలితంగా ‘యడై’ కనుగొన్నా దాని ప్రభావం, దుష్ప్రభావాలను పరిగణలోకి తీసుకున్న అమెరికన్‌ ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఎఫ్‌డీఏ) 2010లో మొదటిసారి, 2013లో రెండవసారి ఈ మందును తోసిపుచ్చింది.

చివరి ప్రయత్నంగా యడైని తయారుచేసిన స్ర్పౌట్స్‌ అనే ఔషధ తయారీ సంస్థ మరోసారి అనుమతి కోరటంతో ఎఫ్‌డీఏ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. యడై మార్కెట్లో విడుదలైన 18 నెలలవరకూ ఔషధ తయారీ సంస్థ స్ర్పౌట్స్‌ ఈ మందు గురించిన ప్రచారం చేసుకోకూడదనేది ఎఫ్‌డీఏ విధించిన షరతు. దుష్ప్రభావాలున్న మందు కాబట్టి వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌తో పని లేకుండా ఎవరికి వారు మెడికల్‌ షాపుల్లో కొనే వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఎఫ్‌డీఏ ఇలాంటి షరతు విధించింది. కాబట్టి యడై వాడాలనుకునే మహిళలు తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *