క్యాబేజీని ఉపయోగించడం వల్ల ఇన్నిఆరోగ్య ప్రయేజనాలు ఉన్నాయ.. తెలిస్తే మీరు ట్రై చేస్తారు..??

సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది.


మనం ఆహారంగా తీసుకునే క్యాబేజీలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలతోపాటు ఇది ఏయే రకాల అనారోగ్యాలకు ఔషధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాపులను తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.


క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.

థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్నివ్వడంతో పాటు వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *