పెడుతుంటే మంట వస్తోంది..మా ఆయన వదలట్లేదు..ఎలా..??

డాక్టర్..నా వయసు 47 ఏళ్లు. ఇప్పటికీ మావారు వారానికి మూడు, నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొంటారు. అయితే, గత కొన్నాళ్లుగా నాకు లోపల మంటగా ఉంటోంది. సెక్స్ లో పాల్గొనాలంటే భయం వేస్తోంది. కానీ మా ఆయన మాత్రం నా బాధ చెప్పినా పట్టించుకోవట్లేదు. తన సుఖం తనదే. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది..? మా వారికి లేదా నాకు ఏమైనా రోగాలు ఉన్నాయంటారా..??

జవాబు సాధారణంగా స్త్రీలకు 45 నుంచి 50 ఏళ్ల వయసు వచ్చేసరికి, మెనోపాజ్ అనే దశ వస్తుంది. ఈ దశ వచ్చిన స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా తక్కువగా విడుదలవుతుంది. దాంతో యోని లోపల పొరలు పలుచగా మారి పొడిబారిపోతాయి. అందుకే సెక్స్ లో పాల్గొంటే నొప్పి, మంటగా అనిపిస్తాయి. ఇది రోగం కాదు. చాలా మందికి జరిగేదే. కానీ మీ వారికి మీరు కూడా మీ సమస్యను అర్ధమయ్యేలా చెప్పాలి. మెనోపాజ్ సమయంలో నొప్పి వస్తున్నప్పుడు కూడా సెక్స్ లో బలవంతంగా పాల్గొంటే, రక్తస్రావం అయ్యే అవకాశాలుంటాయి. అది డిప్రెషన్ కు కూడా దారితీయచ్చు.

ముందుగా, ఇలాంటి విషయాల గురించి భార్యాభర్తలు మోహమాటపడితే, ఇబ్బందులు తప్పవు. ఇద్దరూ మాట్లాడుకోవడమే కాక, డాక్టర్ని సంప్రదిస్తే, అందుకు తగ్గ మందులిస్తారు. మీవారు సైతం లూబ్రికెంట్స్ వాడితే మంచిది. మార్కెట్లో ఈ తరహా అవసరాల కోసం అనేక ల్యూబ్రికెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్లో సైతం ఇవి దొరుకుతున్నాయి. ఇంట్లోనే ఉండే కొబ్బరినూనె కూడా మంచి లూబ్రికెంట్ గానే ఉపయోగపడుతుంది.

ఆరోగ్యకరమైన జీవితానికి శృంగారం అత్యావశ్యకం. అయితే, అది ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. కాబట్టి ఈ విషయం గురించి బెంగ పెట్టుకోకుండా, చక్కగా మీ వారితో శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *