కిడ్నీలో స్టోన్స్ 24 గంటల్లో కరిగిపోయే అద్భుతమైన చిట్కా..!!

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం. మూత్ర పిండాలు మన శరీరంలో కలుషిత రక్తం లేకుండా చేస్తాయి. రక్తంలో ఉన్న నీటిని, విష తుల్యాలను, మలినాలను మూత్రపిండాలు ఎప్పటికప్పుడు వడకడుతూ బయటికి పంపిస్తుంటాయి. అయితే మూత్ర పిండాల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయో కింద తెలుసుకుందాం..!!


మూత్ర పిండాల్లో ఏర్పడే గట్టి పదార్థాలనే మూత్ర పిండాల్లో రాళ్లు అంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, రోజూ సరిపడా నీళ్లు తాగకపోవడం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణాలు. విటమిన్ డీ లోపం, డీ హైడ్రేషన్ కూడా ఈ అనారోగ్యానికి కారణమవుతాయి. రక్తంలో ఇన్ఫెక్షన్, యూరిక్ యాసిడ్, పాస్పేట్ ల కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. పాలు, పాల పదార్థాలయిన కాల్షియం ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీల్లో రాళ్లకు కారణం కావొచ్చు. ఎందుకంటే స్టోన్స్ కు కారణమయ్యే యాగ్జలేట్స్ ను కాల్షియం కిడ్నీల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.
ఎరుపు, పసుపు రంగులో మూత్రం వస్తే రాళ్లున్నాయని అర్థం.

అలాగే వీపుకింద తీవ్రమైన నొప్పి వస్తే రాళ్లు ఉన్నట్లుగా ఇండికేషన్. ఆ నొప్పి పొత్తి కడుపులోకి వ్యాపిస్తుంది. వణుకుతో కూడుకున్న జ్వరం వచ్చినప్పుడు, మూత్రంలో మంట కిడ్నీ స్టోన్స్ లక్షణాలు. అనారోగ్యం, అలసట, ఆకలి వేయకపోవడం, తరచూ తలనొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, శ్వాసలో మార్పులు కిడ్నీల్లో రాళ్లకు సంకేతాలు. ఈ రాళ్లను సులువుగా కరిగించేందుకు మన ఇంటి పదార్థాల్లోనే అద్భుతమైన పరిష్కారాలున్నాయి. అవేంటో చూద్దాం.

నిమ్మరసంలో సైంధవ లవణం కలుపుకుని రోజూ ఉదయం సాయంత్రం తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.
వాటర్ మిలాన్ (పుచ్చకాయ)లో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీల్లో రాళ్లకు బెస్ట్ రెమిడీగా పనిచేస్తుంది.
నీరు, నిమ్మరసంలో తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం రెగ్యులర్ గా తీసుకుంటే రాళ్లు దెబ్బకు కరిగిపోతాయి.
వారంలో ఒకసారయినా ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ లేదా దానిమ్మ గింజలు తింటూ ఉంటే కిడ్నీల్లో రాళ్లు పోతాయి. ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా నివారించబడతాయి.


రూమెట్ రూట్స్ నెల రోజుల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు మూత్రం ద్వారా పడిపోతాయి.
అలోవేరా జ్యూస్ తీసుకుంటే కూడా కిడ్నీ లో రాళ్లు కరిగిపోతాయి
ఇందులో ఏ రెమిడీ పాటించినా రోజూ ఐదు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా పాటిస్తుంటే రాళ్లు కరిగిపోతాయి.
యూరిన్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుకోకూడదు. అప్పుడు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తప్పిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *