ఈ నెల డిసెంబర్ 29 ముక్కోటి ఏకాదశి. ఇలా చేస్తే కోటిజన్మల పుణ్యఫలం..!!

మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత. వైకుంఠ ఏకాదశి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.

ఆ రోజు సూర్యోదయంకంటే ముందే నిద్ర లేవాలి. ఉదయం ఐదింటికే నిద్రలేచి తలస్నానం చేసి పూజామందిరం, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.తలస్నానము చేసి తెలుపు పట్టు వస్త్రాలను ధరించి పూజకు విష్ణుమూర్తి ఫోటోను సిద్ధం చేసుకోవాలి. పసుపు అక్షింతలు, తామర పువ్వులు, తులసిదళాలు, నైవేద్యానికి పాయసం, రవ్వలడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి పూజ చేయవచ్చు. పూజకు విష్ణు అష్టోత్తరం, శ్రీమన్నారాయణ స్తోత్రం, విష్ణుపురాణం, దశావతారాలు పారాయణం చేయాలి.


ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకటేశ్వర దేవాలయం దర్శించుకోవడం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. దీపారాధనకు ఎర్రటి రెండు ప్రమిదలు, 5+5 వత్తులు తీసుకోవాలి. పంచహారతికి ఆవునేతిని, దీపారాధనకు కొబ్బరి నూనె వాడాలి. నుదుట తిరునామం ధరించి, ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజచేసేటప్పుడు తులసిమాల ధరించి, తూర్పు వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *