సుధాకర్ రెడ్డి కోసం వలవలా ఏడ్చేసిన స్వాతి.. ఏమైందో తెలుసా..??

ఇంట్లో ఏ లోటూ లేదు. సుధాకర్ రెడ్డి అహోరాత్రులూ కష్టపడుతూ తనను, ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కాస్థో కూస్థో సంపాదించాడు కూడా.. హాయిగా నడిచిపోతున్న సంసారం.. పైగా ప్రేమ వివాహం కూడా… అటువంటి పరిస్థితుల్లో స్వాతి జీవితం రంగుల హరివిల్లులా ఉండాలి.. కాని ఇప్పుడు తెగిన గాలి పటమైంది. ఇంకా ఘాటుగా చెప్పాలంటే కుక్కలు చింపిన విస్తరి చేసుకుంది. క్షణిక సుఖాలే సర్వస్వంగా ఫీలైంది. అక్రమ సంబంధం ఇచ్చే తాత్కాలిక ఆనందపు భ్రమల్లో… యావత్ జీవితంలో నిప్పులు పోసుకుంది. ఇద్దరు పిల్లలను గూడు చెదిరిపోయిన పక్షులను చేసింది. అఘాయిత్యం బయటపడిన 15రోజుల తర్వాత ఆమెకు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గుర్తుకొచ్చాడు. అవును మరి పక్షం రోజులు అనుభవించిన కష్టాలు అసలు జీవితం అంటే ఏమిటో తెలియచెప్పాయి. ఇక అంతే భర్తను తల్చుకుని వలవలా ఏడ్చింది.


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుధాకర్‌రెడ్డి హత్యకేసులో రెండో నిందితురాలు, మృతుని భార్య స్వాతిని నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసులు మరోమారు విచారించారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి ఉదయం 10.30 గంటలకు అదుపులోకి తీసుకొన్న పోలీసులు 11.30 గంటలకు నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఠాణాలో పోలీసులు సుమారు 5 గంటల పాటు ప్రత్యేక గదిలో విచారించారు. హత్యకు సంబంధించి పోలీసులు స్వాతిపై ప్రశ్నలు సంధించగా ఆమె కొన్నింటికి జవాబిచ్చినట్లు తెలిసింది.

రాజేష్‌ మాటలు నమ్మి ఈ ఘాతుకానికి తెగించినట్లు స్వాతి జరిగిందంతా చెప్పుకొచ్చింది. తన భర్తను అన్యాయంగా చంపుకున్నానంటూ స్వాతి పోలీసుల విచారణలో భోరున ఏడ్చింది. అతని మైకంలో ఉండి అతను చెప్పినట్లే చేశానంది. అంతా సినిమాలో మాదిరిగా జరిగిపోతుందని భావించానని పేర్కొన్నట్లు సమాచారం. హత్యకేసుకు సంబంధించిన అదనపు సమాచారం కోసం పోలీసులు నాలుగు రోజులపాటు కోర్టును అనుమతి కోరగా రెండు రోజులు మాత్రమే విచారణకు కోర్టు అనుమతించింది. విచారణ అనంతరం హత్యరోజున స్వాతి ధరించిన దుస్తులు, వినియోగించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్‌రెడ్డిని తలపై గట్టిగా రాడ్‌తో కొట్టగా.. గాయానికి వచ్చిన రక్తాన్ని తుడిచిన దుస్తులను స్వాతి ఇంట్లోని బీరువా నుంచి తీసుకొచ్చారు.


ఆమెను ఇంటికి తీసుకెళ్లి బీరువాను తెరిపించి అక్కడ దాచిన దుస్తులను తీసుకొచ్చి కోర్టుకు అందజేశారు. అనంతరం స్వాతిని కోర్టు ఎదుట హాజరుపరిచి మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించారు. మొదటి రోజు విచారించినప్పుడు సుధాకర్‌రెడ్డిని హత్యచేసిన రోజున వారు వేసుకున్న దుస్తులు ఎక్కడ ఉన్నాయని ఆరాతీస్తే పూర్తి సమాధానం ఇవ్వలేదు. రాజేష్‌ దగ్గర ఉన్నట్లు స్వాతి చెప్పింది. రాజేష్‌ని విచారిస్తే స్వాతికే తెలుసని అబద్ధమాడాడు. మొత్తానికి స్వాతికి తన భర్తను ఎంత అన్యాయంగా పొట్టనబెట్టుకున్నదో విషయం బోధపడే సరికి పోలీసుల విఛారణకు పూర్తిగా సహకరించింది.


గత నెల 27న నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్న క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌రెడ్డికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్‌లు హత్య చేసిన ఘటన పెను సంచలనం రేపింది. స్వాతి క్రూయల్, క్రిమినల్ మెంటాలిటీని చూసి యావత్ దేశం నివ్వెరపోయింది. సుధాకర్‌రెడ్డి శవాన్ని నవాబుపేట మండలంలోని అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి దహనం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తన ప్రియుడు రాజేష్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించి భర్త సుధాకర్‌రెడ్డి స్థానంలో రంగప్రవేశం చేయించాలని స్వాతి పన్నిన కుట్ర భగ్నమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న పోలీసులు స్వాతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు రాజేష్‌ను కూడా ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. అనైతిక బంధం, శారీరక సుఖమే జీవిత పరమార్థమనకున్న ఆ ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *