ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి సైతం, ఆ చోటికి వెళ్తే తగ్గిపోతుంది..!!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకర వ్యాధి క్యాన్సర్. ఎన్ని మందులు వాడినా, కోట్లు ఖర్చుపెట్టినా నయమవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి వ్యాధి కూడా ఇకారియాకు వెళ్లగానే మాయమవుతోంది. అసలు ఆపరేషన్ పని కూడా ఉండట్లేదు. అందుకు ఒక మంచి ఉదాహరణ స్టామటిస్ అనే వ్యక్తి జీవితం.

1943 లో గ్రీస్ యుద్ధంలో పాల్గొన్న స్టామటిస్, ప్రాణాలకు తెగించి అందుల్లో పోరాడాడు. అయితే బాంబు దాడిలో అతని చెయ్యి వంకరపోయింది. ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి స్టామటిస్ పై కాల్పులు జరిపాడు. చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్న అతను, టర్కీకి పారిపోయాడు. అయితే అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేక ఒక నౌకలో న్యూయార్క్ వెళ్లిపోయాడు.

న్యూయార్క్ లోనే ఉద్యోగం వెతుక్కని, అక్కడే స్థిరపడ్డాడు. ఒక గ్రీక్ అమెరికా మూలాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లల్ని కని హాయిగా జీవితం గడుపుతున్నాడు. 1976లో అతని జీవితంలో మళ్లీ కుదుపు. ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం అతనికి కష్టమయ్యేది. ఆఫీస్ లో మెట్లు సైతం ఎక్కలేకపోయేవాడు. వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది. ఎన్ని ట్రీట్ మెంట్స్ చేసినా, ఇక 9 నెలలకు మించి బ్రతకడు అని డాక్టర్లు చెప్పేశారు. అప్పుడు స్టామటిస్ వయసు 60 ఏళ్లు.


ఖచ్చితంగా చనిపోతానని తెలిసిన తర్వాత, న్యూయార్క్ లో తన సమాధి కోసం కొంత స్థలం కొనుక్కోవాలనుకున్నాడు. కానీ అప్పటికే అక్కడ ఒక్క అడుగు స్థలం కూడా కొనలేని రేట్లు ఉన్నాయి. దీంతో తన తాత ముత్తాతల ఊరైన ఇకారియాకు వెళ్లిపోవాలనుకున్నాడు. తన పూర్వీకుల సమాధుల పక్కనే తన సమాధి కూడా ఉండాలని కోరుకున్నాడు. భార్యతో కలిసి ఇకారియా వచ్చేశాడు. ద్రాక్ష తోటల పక్కనే ఓ రెండెకరాల స్థలంలో ఓ ఇంటిని కొన్నాడు. అక్కడి నుంచి ఆయన జీవితం మంచానికే పరిమితమైపోయింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *