నానిని అంత‌గా బాధ పెట్టింది ఎవరు..అసలు ఏమైంది..??

నాని.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న వ‌న్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట‌ర్. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల జోలికే వెళ్ల‌ని ఓ హీరో. ఈయ‌న్ని చూస్తే ఎవ‌రికీ వివాదాల్లో ఇరికిం చాల‌ని కూడా అనిపించ‌దు. త‌న ప‌ని తాను చూసుకుంటాడు. ప‌క్కోడి జోలికి అస‌లే వెళ్ల‌డు. అందుకే నాని అంద‌రివాడు అయ్యాడు. ఈయ‌న అన్ని హీరోల అభిమానుల‌కు ఆప్తుడే. ఏ స‌పోర్ట్ లేకుండా ఇంత‌గా ఎదిగాడు అంటేనే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది.

వ‌ర‌స‌గా ఇన్ని విజ‌యాలు వ‌స్తున్నాయంటే నానిలో ఏదో మ్యాజిక్ ఉంద‌నేగా అర్థం. ఇలాంటి హీరోకు ఇప్పుడు కోపం వ‌చ్చింది. అస‌లు న‌వ్వు త‌ప్ప మొహంపై మ‌రోటి క‌నిపిం చ‌ని నానికి ఇప్పుడు కోపం వ‌చ్చింది. దానికి కార‌ణం ఓ వెబ్ సైట్. ఇన్నాళ్లూ ఈయ‌న మ‌న‌సులో దాచుకున్న ఆ బాధ‌ను ఇప్పుడు బ‌య‌టికి చెప్పాడు నాని.

ఎంత హీరో అయినా.. సెలెబ్రేటీ అయినా వాడికి కూడా ఓ లైఫ్ ఉంటుంది.. ప‌క్కోడి ప‌ర్స‌నల్ లైఫ్ లోకి వ‌చ్చి తొంగిచూడ‌టం త‌ప్పు అంటున్నాడు నాని. త‌న‌కు కూడా ఓ భార్య ఉంద‌ని.. పిల్లాడు ఉన్నాడ‌ని.. పెళ్లైన హీరో గురించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తే ఏమనుకోవాల‌ని ప్ర‌శ్నించాడు నాని. త‌న‌కు ఓ హీరోయిన్ కు ఎఫైర్ ఉంద‌ని ఆ వెబ్ పోర్ట‌ల్ రాసింద‌ని చెప్పాడు నాని.

కావాలంటే తాను వాళ్ల పేరు చెప్పొచ్చు కానీ అలా చేసి వాళ్ల ఇమేజ్ తీయ‌డం త‌న ఉద్దేశ్యం కాద‌న్నాడు నాని. అంతేక‌దండీ.. సినిమాల ప‌రంగా నాని ఏం చేసాడు.. ఇలా చేస్తాడా అని ఇష్ట‌మొచ్చిన రూమ‌ర్లు రాసుకోవ‌చ్చు కానీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోకి వెళ్లి మ‌రీ రాయ‌డం అనేది కాస్త ఇబ్బందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *