దంతాలు పచ్చబడుతున్నాయా.. కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

దంతాలు పచ్చబడుతున్నాయా.. కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..టీవీ యాడ్స్ లోనో, సినిమాల్లోనో సెలబ్రిటీల దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది దంతాలు ఎంతో కొంత పసుపు రంగులోకి మారి కనిపిస్తుంటాయి. చాలా మంది దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణాలు, వాటి నుంచి బయటపడడం అనేది మన చేతిలోనే ఉంది. కొంచెం శ్రద్ధ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సమస్యల నుంచి బయటపడొచ్చు.


మన దంతాలు పచ్చబడడానికి చాలా రకాల కారణాలున్నాయి. మనం తినే ఆహారం దగ్గరి నుంచి మన ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో అంశాలు దంతాలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా దంతాల పైపొర ఎనామిల్ తెలుపు రంగులో పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల ఉండే డెంటిన్ లేత పసుపు రంగులో ఉంటుంది. ఎనామిల్ మందంగా ఉంటే దంతాలు తెల్లగా కనిపిస్తాయి. సన్నగా ఉంటే పసుపు రంగులో కనిపిస్తాయి. మనలో వయసు పెరిగిన కొద్దీ ఎనామిల్ మందం తగ్గిపోతుంటుంది. దాంతో దంతాలు పసుపురంగులో కనిపిస్తుంటాయి.

దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి. వీటిని ఎక్స్ ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ అని రెండు రకాలుగా చెప్పవచ్చు.దంతాల్లోని పై పొర అయిన ఎనామిల్ పైన ఏర్పడే మరకలు, పసుపుదనాన్ని ఎక్స్ ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. ప్రధానంగా మన ఆహార అలవాట్లు, దంతాలు సరిగా శుభ్రపరచుకోకపోవడం దీనికి కారణాలు. ముఖ్యంగా యాసిడిక్, ముదురు రంగు ఆహార పదార్థాలు, ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి పండ్లు, రెడ్ వైన్, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలు ఎక్కువగా పసుపుబారుతాయి.
దంతాల లోపలి భాగంలో ఏర్పడే మరకలను ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు.

వివిధ రకాల మందులు, అనారోగ్య కారణాల వల్ల ఇవి ఏర్పడుతాయి. పిల్లల్లో టెట్రాసైక్లిన్, డోక్సిసైక్లిన్ వంటి యాంటీ బయాటిక్స్ వినియోగించినప్పుడు వారి పళ్లు పసుపు బారుతాయి. చిగుళ్లవ్యాధికి చికిత్సలో ఇచ్చే మందులు, మొటిమలను నివారించేందుకు వాడే మందులు, రక్తపోటును నియంత్రణలో ఉంచే ఔషధాల వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *