ఇలా చేసి మీ గ్యాస్ ట్రబుల్ ని తరిమికొట్టండి

గ్యాస్ ట్రబుల్..ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది. ఇది మనిషిని చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది. దీనినే ఒక విధంగా ‘కడుపు ఉబ్బరం’ అని కూడా అంటారు. కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇది తలెత్తుతుంది. వేళకు ఆహారం తీసుకోకపోవడం..మానసిక వత్తిడికి గురి కావడం…రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం..మసాలాతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం..ఇలా కొన్ని కారణాలు గ్యాస్ ట్రబుల్ కు దారి తీస్తాయి.

కడుపు ఉబ్బరంతో గ్యాస్ ట్రుబుల్‌తో బాధపడేవారికి ఆయుర్వేదంలో మంచిమందు ఉన్నదంటున్నారు. చిత్రకాదివటి అనే ఔషధం గ్యాస్‌ ట్రబుల్, ఉదర వ్యాధులను నివారించగలుగుతుంది. ఇది ఆయుర్వేద షాపుల్లో మాత్రల రూపంలో దొరుకతుంది. మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని, చిత్రకాదివటి ఒక మాత్ర వేసుకుని మజ్జిగ త్రాగితే పుల్లటి త్రేనుపులు, పొట్ట ఉబ్బరం, పైత్యం నివారిస్తాయి.

ధనియాలు, జీలకర్రను విడివిడిగా నేతిలో వేయించి, కొంచెం ఉప్పు కలిపి వీటిని పొడిచేసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని – చిత్రకాదివటి మాత్రను వేసుకుని మజ్జిగను త్రాగుతుంటే జిగట విరోచనాలు, ఉదర వ్యాధులు తగ్గిపోతాయి. చిత్రకాదివటి మాత్రను పూటకు రెండు చొప్పున వేసుకుని, కుటజారిష్ట అనే ఔషధాన్ని మూడు చెంచాలు తాగుతుంటే అమీబియాస్ వ్యాధి నివారించబడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *