మైలేజ్ 80 కిలోమీటర్లు ఇచ్చే బైక్ ధర 25 వేలు….

మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఒకప్పుడు సైకిల్ నుంచి., ఇప్పుడు బైక్ వరకూ వచ్చాము.. ఈరోజుల్లో కుర్రాళ్ళ చేతుల్లో ఫోను, దూసుకుని వెళ్ళడానికి బైక్ ఉండటం చాలా కామన్ అయిపోయింది.. ప్రస్తుతం మార్కెట్ లో బైక్ కొనాలంటే, కనీసం 70 వేలు తక్కువ కాకుండా ఖర్చవుతుంది… యూత్ కి నచ్చినట్టు మోడల్ గా ఉండాలంటే, లక్ష పట్టుకోవలసిందే. ఇంతా పెట్టినా కూడా దాని మైలేజ్ మాత్రం, లీటర్ పెట్రోల్ పోస్తే కనీసం 50 కిలోమీటర్లకు కూడా రావడం లేదు…

ఇలాంటి పరిస్థితుల్లో 25 వేల రూపాయలకే బండి, లీటరుకి 80 కిలో మీటర్లు మైలేజీ ఇచ్చే వాహనం దొరకడం అంటే అదొక అదృష్టమనే చెప్పాలి….ఇలాంటి అద్భుతమైన బండిని సృష్టించిన వ్యక్తి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి.. 25 వేల రూపాయలకే లీటరుకి 80 కిలో మీటర్లు మైలేజీ ఇచ్చే బండిని కటినిపెటింది వంశీకుమార్ అనే ఒక కుర్రాడు కావడం విశేషం…

ఇతని తండ్రి ఒక సాధారణ ఆటోడ్రైవర్. తల్లి గృహిణి. అన్న, చెల్లెలు. చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ సౌండ్స్ అంటే ఇతడికి ఇష్టం. ఆ సౌండ్ వచ్చేందుకు ఇంజన్, సైలన్సర్ల పనితీరును పరిశీలించడం తనకున్న ఆసక్తితో అలవాటు చేసుకున్నాడు. అప్పుడు అతడికి తెలిసిన ఓ పెద్దాయన.. ‘చిన్న వయసులోనే మెకానిక్గా బాగా పనిచేస్తున్నావ్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే నువ్వూ ఇలాంటివి తయారు చేయొచ్చు’ అని ఒక మంచి సలహా ఇచ్చారు…


ఇలా ఆ కుర్రాడు , తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్ను తయారు చెయ్యాలనే సంకల్పం ఆ వయసులోనే పెట్టుకున్నాడు. అందుకు అవసరమైన స్పేర్పార్ట్స్ను తయారు చేయించి, ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించి 110 సీసీ ఇంజన్ తీసుకుని, అవసరమైన మార్పులు చేసి బైక్ తయారు చేసాడు. దీని కోసం రూ.60 వేలు ఖర్చయింది. ఎక్కువ సంఖ్యలో బైక్ తయారు చేయాలంటే రూ.25 వేలు చాలు అని వంశీకుమార్ తెలిపాడు.

కోస్తా ప్రాంతం నుంచి వంద బైక్లు కావాలన్నారు. అందుకు కావాల్సిన రవాణాశాఖ ఇతరత్రా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తునాని తెలిపారు. ఇలాంటి కుర్రాళ్ళని అభినందించి తీరాలి…ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *