త‌ల్లి కోసం ప్రాణాలు వ‌దిలిన కన్న కొడుకు..ఎలా జరిగింది అంటే..??

త‌ల్లిని బ‌తికించుకునేందుకు ఆ యువ‌కుడు ఎంచుకున్న దారి అత‌ని ప్రాణాలు తీసింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అమ్మ‌కు చిక‌త్స కోసం చైనాకు చెందిన యోంగ్ నింగ్ చేసిన సాహ‌సం అత‌ని మృత్యువుకు కార‌ణ‌మైంది. డ‌బ్బుల కోసం యోంగ్ యూట్యూబ్ హీరోగా మారాడు. ప్ర‌మాద‌క‌ర స్టంట్లు చేసి వాటిని యూట్యూబ్‌లో వైర‌ల్ చేసి డ‌బ్బులు సంపాదించేవాడు.

ఎత్తైన భ‌వ‌నాలు, ప్రాంతాల్లో వేలాడుతూ, వ్యాయామాలు చేస్తూ వీడియో తీసుకోవడం, వాటిని యూట్యూబ్‌లో పెట్టి డ‌బ్బుల సంపాదించ‌డం యోంగ్ నిత్య‌కృత్యం. ఈ సాహ‌సాల వ‌ల్ల యోంగ్ హీరోగా మారిపోయాడు. ఫేస్‌బుక్‌లో అత‌నికి దాదాపు 3 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ సాహ‌సాలు చేస‌ట‌పుడు యోంగ్ క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోడు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఓ ఎత్తైన గాజు భ‌వనం అంచున ప్ర‌మాద‌క‌ర సాహసం చేస్తున్న స‌మ‌యంలో ప‌ట్టు త‌ప్పి కింద ప‌డిపోయాడు. దీంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలాడు. చైనాలో మొట్ట‌మొద‌టి రూఫ్‌టాప్ వీరుడైన యోంగ్ మ‌ర‌ణాన్ని అత‌ని ప్రియురాలు ధ్రువీక‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *