విజయ్ సాయి తల్లిదండ్రులు సంచలన వాఖ్యలు…నా కోడలు చేసిన ఆ పాడు పనివల్లే నా కొడుకు చనిపోయాడు

విజయ్ సాయి తల్లిదండ్రులు సంచలన వాఖ్యలు…నా కోడలు చేసిన ఆ పాడు పనివల్లే నా కొడుకు చనిపోయాడు..టాలీవుడ్ లో బాడ్ టైం నడుస్తుంది అనే చెప్పుకోవాలి ..యువ నటులు ఆత్మ హత్యలు చేసుకొని చనిపోతున్నారు .. తాజాగా కమెడియన్ విజయ్ సాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన సొంత ఫ్లాట్ లో ఆయన ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.


బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు సినిమాలతో మంచి కమెడియన్ గా, టైమింగ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోల పక్కన కమెడియన్, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు విజయ్..ఇటీవల కాలంలో సినిమాల్లో కనిపించటం లేదు విజయ్. అవకాశాలు బాగా తగ్గిపోవటంతోపాటు అప్పులు కూడా ఉండటంతోనే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని సన్నిహితులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్విస్తూ, చలాకీగా ఉండే విజయ్ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఫ్యామిలీతో గొడవలు సినిమాల్లో అవకాశాలు తగ్గడం.. ఎంత కష్టపడినా బ్రేక్ రాకపోవడం… పెట్టుబడి పెట్టిన సినిమా విడుదల కాకపోవడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఐతే కొంతకాలంగా విజయ్ సాయి డిప్రెషన్ లో ఉంటున్నాడని అతడి స్నేహితులు తెలియజేస్తున్నారు . విజయ్ సాయిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి.విజయ్ ఆత్మహత్యకు.. భార్య వనిత వేధింపులు కూడా కారణం అంటున్నారు కుటుంబ సభ్యులు. టీవీ సీరియళ్లలో నటించే వనితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు .


ఐతే విజయ్‌  వనితకు మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వనిత విజయ్‌ ను తరచూ వేధించేదని.. మూడు రోజుల క్రితం భర్త నుంచి కారును కూడా బలవంతంగా తీసుకెళ్లిందని విజయ్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు .విజయ్ – వనితలది ప్రేమ వివాహం .. ఆమె వీరి ఇంటికి వస్తే పొట్టి బట్టలు వేసుకొని వచ్చి విజయ్ ను పెళ్ళి చేసుకుంటానని వెంటపడిందని.. ప్రేమించాడు కదా అని తాము కూడా పెళ్ళికి ఒప్పుకున్నామని అంతకు మించి వనిత కుటుంబ సభ్యుల వివరాలు కూడా తమకు తెలీవని..వారు తెలిపారు .. వనిత పెళ్ళి చేసుకున్న తర్వాత విజయ్ ను చాలా ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకొచ్చారు


విజయ్ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయిందని… ఆత్మ హత్యకు ముందు పెద్దల సమక్షం లో పంచాయతి కూడా జరిగింది ఆ తర్వాత విజయ్ తెల్లవారుజామున నాలుగుకు వచ్చాడని విజయ్ తల్లి చెప్పడం జరిగింది . ఎన్నో గొడవల తర్వాత కూడా మామూలుగా ఉండాలని తన కొడుకు ప్రయత్నించాడని కానీ విజయ్ భార్య అతడిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *