అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు..అందరికి తెలియచేయండి

రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.


అల్లం టీ వలన కలిగే ముఖ్యమైన ఉపయోగం డోకులను కలిగించే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మీరు ప్రయాణాలు చేసే ముందుగా అల్లం టీ తాగటం వలన డోకులను మరియు వాంతులతో కూడిన విరేచనాల వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ తాగటం వలన మీరు మొదటగా గుర్తించేది, డోకుల నుండి విమూక్తి.

ఒత్తిడి నుండి ఉపశమనం
అల్లం టీ శాంతన పరిచే గుణాలను కలిగి ఉండి, ఒత్తిడి మరియు ఆందోళనలను తగ్గిస్తుంది. అల్లం గాఢ వాసనను కలిగి ఉండటం వలన ఇది ఒత్తిడి మరియు ఆందోళనలు దూరం చేస్తుంది.
రుతుక్రమంలో వచ్చే ఇబ్బందులను తోలగిస్తుంది
అల్లం టీ వలన కలిగే మరొక ప్రయోజనం రుతుక్రమంతో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఉరటను కలిగిస్తుంది. రుతుక్రమం సమయంలో చిన్న తువ్వాలను లేదా చిన్న గుడ్డను తీసుకొని వేడి అల్లం టీలో తడిపి, ఉదర భాగంలో అద్దటం వలన కండరాలు విశ్రాంతి చెంది, నిప్పిని తోలగిస్తాయి. రుతుక్రమంలో మంచి ఫలితాల కోసం అల్లం టీలో తేనేని కలుపుకొని తాగటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
అల్లం టీ విటమిన్’లను, మినరల్స్ మరియు అమైనోఆసిడ్’లను కలిగి ఉండి రక్త ప్రసరణను మెరుగు పరచటం వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అల్లం టీ తాగటం వలన గుండెని ఆరోగ్యకరంగా ఉంచి గుండెపోటు మరియు ఇతరేతర గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
కండరాల గాయాలను ఉపశమనం
అల్లం టీ లో శక్తివంతమైన ‘యాంటీ-ఇంఫ్లమేషన్’ గుణాలను కలిగి ఉండటం వలన వ్యాయామం తరువాత కలిగే కండరాల నొప్పి తగ్గేలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా, ఎక్కువ శ్రమపడిన తరువాత వచ్చే కండరాల నొప్పులకు ఒక కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది.

ఇంఫ్లమేషన్’లను తగ్గిస్తుంది
అల్లం అద్భుతమైన యాంటీ-ఇంఫ్లమేషన్ గుణాలను కలిగి ఉండటం వలన కండరాల మరియు కీళ్ళ నొప్పులకు ఉపశమన కారిగా పనిచేసే ఇంట్లో ఉండే ఔషదంగా పేర్కొనవచ్చు. అల్లం టీ తాగటం వలన ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాకుండా మరియు కీళ్ళలో వచ్చే ఇంఫ్లమేషన్’లకు తగ్గించుటలో సహాయపడుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది
అల్లం టీ తాగటం వలన కంజెషన్ వంటి సమస్యలు మరియు జలుబు వంటి సాధారణ వ్యాధులు కూడా తోలగించబడతాయి. రోజు ఒక కప్పు అల్లం టీ తాగటం వలన వాతావరణ కాలుష్యం వలన శ్వాస గొట్టంలో కలిగే అలర్జీలు కూడా తోలగించాబడతాయి.

బరువు తగ్గుటకు సహాయం
అల్లం టీ మీ బరువు తగ్గుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కొవ్వు పదార్థాలను కరిగించి బరువు తగ్గుటలో సహాయ పడుతుంది. అల్లం టీ వలన శరీరంలోని కొవ్వు పదార్థాలు మాత్రమే కరిగింపబడి బరువు తగ్గుదలను ప్రోత్సహిస్తుంది మరియు శరీర బరువుని తగ్గించదు. అల్లం టీ తాగటం వలన నిండుగా అనిపించటం వలన తక్కువగా తిని మీ శరీరంలో తీసుకునే క్యాలోరీల సంఖ్య తక్కువగా తీసుకునే అవకాశం ఉంది.
గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ
నూతనంగా, ఆస్ట్రేలియాలో నిర్వహించబడిన పరిశోధనల ప్రకారం, అల్లం టీ తాగటం వలన శరీర రక్తంలోని గ్లూకోస్’ను ఆరోగ్యవంతమైన స్థాయిలో ఉంచుతాయి. గ్లూకోజ్ స్థాయిలు నేరుగా శరీర బరువు మరియు రోజు అందించబడే శక్తి, రోజు చేసే పనుల పైన ప్రభావాన్ని చూపుతుంది. అల్లం టీ మిమ్మల్ని విశ్రాంతి పరచి మరియు రక్తంలోని చక్కెరల వలన కలిగే సమస్యలకు దూరంగా ఉండేలా సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *