గర్భిణులు బొప్పాయి తింటే అబార్షన్‌ అవుతుందా..?? ఎంత వరకు నిజమో తెలుసుకోండి.!!

పండ్లలో వేటి ప్రత్యేకత వాటిదే. వీటిలో బొప్పాయి పండు తీసుకోవడం కలిగే ఫలితాలు ఎన్నో ఉన్నాయి. అన్ని పళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తే బొప్పాయి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి పోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇందులో కంటికి మేలు చేసే విటమిన్ ఎ కూడా ఉంటుంది. క్యాన్సర్‌ను నిరోధించే లైకోపీస్ కూడా సమృద్దిగా దొరుకుతుంది. మలబద్దక౦తో బాధపడే వారికి బొప్పాయి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. బొప్పాయిలో పీచు పదార్ధం ఎక్కువ.

బొప్పాయి గుజ్జుని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా తయారవుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. మొటిమల నివారణ, ఆయిల్ ఫేస్ కూడా తగ్గుతుంది. చర్మం పైన ఏర్పడిన మృత కణాలను బొప్పాయి పోగొడుతు౦ది. పచ్చి బొప్పాయి నుంచి విటమిన్ సి, ఖనిజ లవణాలు శరీరానికి అందుతాయి. చిన్న పిల్లలకు కడుపు నొప్పి, నులిపురుగులు ఉన్న‌ట్ల‌యితే తరచు బొప్పాయిని తినిపిస్తే నులిపురుగులు పోతాయి. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. రోజూ బొప్పాయిని తేనెతో పాటు తింటే గుండె, మెదడు, కాలేయం, నరాలకు రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది.

మధుమేహ వ్యాది ఉన్నవాళ్ళు రోజుకు రెండు బొప్పాయి ముక్కలు తింటే విటమిన్స్ లోపం రాదు. బొప్పాయి ఆకులు, విత్తనాలు, పాలు, పేగులోని పరాన్న జీవులను నాశనం చేయటానికి, చాలా రకాల వ్యాధులకు మందుగా పని చేస్తుంది. శరీరంలో హాని కలిగించే టాక్సిన్‌లను బొప్పాయి నివారిస్తుంది. ఇది జీర్ణ వ్య‌వస్థపై చక్కగా పనిచేస్తుంది. శరీరంలోని కొవ్వు తీసేయటానికి బాగా పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా నివారిస్తుంది. జ్వరం, జలుబుతో భాదపడే వారికి బొప్పాయి ఎంతో మంచిది.

రోజు బొప్పాయి తినటం వలన రోగనిరోధ‌కశక్తి పెరుగుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బొప్పాయిని రోజు తింటే బరువు తగ్గుతారు. బొప్పాయిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. మహిళలో సహజంగా ఉండే రుతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు. గర్భిణులు మాత్రం ఈ పండు తినక పోవడమే మంచిది. గర్భ స్రావం అయ్యే ప్రమాదం ఉంది. బొప్పాయి మంచి పోషక విలువలు ప్రోటీన్లు కలిగిన ఫలం.

విటమిన్‌ ఎ విపరీతంగా తీసుకుంటే అబార్షన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గర్భ విచ్ఛిత్తి జరిగేటంత విటమిన్‌ ఎ అందాలంటే కనీసం 5 కిలోల మేర బొప్పాయి తినాలి. ఇంతమేర గర్భిణులు తినలేరు కాబట్టి బొప్పాయి తినటం వల్ల అబార్షన్‌ జరుగుతుందని అనుకోవటం పొరపాటు. మిగతా పళ్లకులాగానే బొప్పాయిని పరిమితంగా తీసుకోవటం వల్ల ప్రమాదం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *