ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో… బిడ్డను ఆసుపత్రి గేటు ముందు వోదిలేసింది

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో… బిడ్డను ఆసుపత్రి గేటు ముందు వోదిలేసింది ..ఎక్కడో ప్రసవించి, నిజామబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రి గేట్ ముందు అప్పుడే పుట్టిన బిడ్డను వోదిలేసింది ఓ తల్లి. ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిoదో. నిజామాబాద్‌ నగరంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రవేశ మార్గం వద్ద వదిలి వెళ్లారు. అయితే ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఆ శిశువును గమనించి ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ శిశువు వేరే ఆస్పత్రిలో జన్మించినట్లు ప్రభుత్వాస్పత్రి అధికారులు అంటున్నారు. శిశువును ఎవరు వదిలివెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు.


నవజాత శిశువు ఉదయించింది. నవమాసాలు మోసిన మమకారం సమాజం ముందు ఓడిపోయింది. ఎవ్వని మోసమో-ఎంతటి కష్టమో, ఎంతటి భారమో- ఎవరి బలవంతమొ తల్లి పేగు తెంచకున్న శిశువు తల్లికి దూరం అయింది. అమ్మ మనసు నిజం. దాన్ని మరిపించిన కారణాలు ఏవైనా అవి అబద్దం కావాలని అరిచి చెప్పండి. అడపిల్ల అయితే ఒక సగం, మగపిల్లోడైతే ఇంకో సగం. ఇదే నిజం. సగం బ్రతుకులు సగం సొగసులు, సగం నాగరికతల పోకడలే ఇవి. సగం మనుషులమే ఇంకా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *