ఎంత జ్ఞానమో కదా కాపాడిన వారికి.. ఏనుగు కృతజ్ఞత ఇలా..??

ఏనుగ లేదా ఏనుగు ఆంగ్లం Elephant ఒక భారీ శరీరం, తొండము కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు ఆఫ్రికా ఏనుగు మరియు ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు మరియు బాగా తెలివైనవి.

కేరళలోని తత్తెకాడ్ అడవిలో ఒక పిల్ల ఏనుగు “ఉరులంతాన్ని” అనే నదిని తన తల్లి ఏనుగుల గుంపుతో దాటే క్రమంలో బురదగుంటలో పడిపోయింది. ఏనుగుల గుంపు ఎంత ప్రయత్నించిన పిల్ల ఏనుగుని బయటకు తీసుకురాలేకపోయాయి. పైకి రాలేక ఇబ్బంది పడుతున్న ఏనుగు పిల్లను గుర్తించిన ఫారెస్టు అధికారులు స్ధానిక గిరిజన ప్రజల సాయంతో రెస్కూ ఆపరేషన్ చేపట్టి ఆ పిల్ల ఏనుగుని రక్షించారు.


బురదలో నుంచి బయటకు వచ్చిన పిల్ల ఏనుగు పక్కనే ఉన్న ఏనుగుల గుంపు వద్దకు వెళ్ళి తనను రక్షించిన ప్రజలవైపు కృతజ్ఞతగా చూసింది.`పిల్ల ఏనుగు తల్లి అక్కడ ఉన్నవారందరిపై తొండంతో నీళ్లు చల్లి తమ పిల్ల ఏనుగును రక్షించినందుకు అక్కడున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. అక్కడ ఉన్నవారు ఈ ఆపరేషన్ అంతా తమ ఫోన్ లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. 2.5 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేల లైక్ లతో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *