ఇప్పుడు ఈయన లక్షాధికారి..భార్య శవాన్ని ఎత్తుకుని నడిచిన వ్యక్తి గుర్తున్నాడా..!!

ఇప్పుడు ఈయన లక్షాధికారి..భార్య శవాన్ని ఎత్తుకుని నడిచిన వ్యక్తి గుర్తున్నాడా.. భార్య శవాన్ని తరలించడానికి ఆస్పత్రి యాజమాన్యం అంబులెన్స్ ఇవ్వకపోవడంతో దాదాపు 10 కిలోమీటర్లు తన భుజంపై మోసుకెళ్లాడు ఒడిశాకు చెందిన ధనామాఝీ. 2016, ఆగస్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం. దీనికి కారణమైన అధికారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. మాఝీ దయనీయమైన స్థితి ఎందరో హృదయాలను కలిసివేచింది. కనీసం భార్య శవాన్ని స్వగ్రామానికి తరలిచేందుకు డబ్బులు లేని పరిస్థితి అప్పుడు అతడిది.

ఇప్పుడు అతడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కట్టుకుని బైక్ కొనుక్కున్నాడు. ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. మాఝీ ముగ్గురు కుమార్తెలు భువనేశ్వర్‌లోని రెసిడెన్షియల్‌ స్కూళ్లో చదువుకుంటున్నారు. ఓ విద్యాసంస్థ ఉచితంగా విద్యను అందిస్తోంది. అంతేకాదు.. అలమతి దై అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. రూ.65వేల విలువైన హోండా బైక్ కొన్నాడు. ఆయనకు ఉన్న కొంత పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ మధ్యే మాఝీ తన భార్య శవాన్ని ఎత్తుకుని నడిచిన దారిలోనే తన కొత్త బైక్ పై తిరిగాడు.

ఒడిశాలోని కలహండి జిల్లాకి చెందిన ధనామాఝీ భార్య అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలోనే చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు యాజమాన్యం అంబులెన్స్‌ ఇవ్వలేదు. ప్రైవేటు అంబులెన్స్‌లో తీసుకెళ్లే ఆర్థిక పరిస్థితి లేదు. చేసేదేమి లేక తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10కి.మీ నడిచాడు. ఈ అమానవీయమైన ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. ఆ దృశ్యాలు ఎంతో మంది హృదయాలను కలిచివేశాయి.

వాటిని చూసిన బహ్రెయిన్‌ ప్రధానమంత్రి, రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మాఝీకి రూ.9లక్షల చెక్కును పంపించారు. ఆయనతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా మాఝీకి సహాయం చేశాయి. అతడి పరిస్థితి తెలుసుకున్న అధికారులు ప్రధానమంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజనా కింద కొత్త ఇంటిని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అతడికి సహాయం కింద వచ్చిన నగదును బ్యాంకులో కుమార్తెల పేరిట ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశాడు. ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచిన రోడ్డుపై.. బైక్ పై తిరుగుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *