ఇలంటి విద్యార్ధులని చూస్తే….చీకొడతారు..

విద్యార్థిలోకమే తలదించుకునే పనిచేశారు ఒడిశాలోని కొంతమంది విద్యార్థులు. కాలేజ్‌ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు గురిచేయడం జరిగింది . అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఈ దారుణం ఒడిశాలోని జరిగింది. కాలేజ్‌ అయిన తరువాత విద్యార్థులంతా గుంపులుగుంపులుగా ఇంటికి వెళుతున్నారు. ఈ సంయంలో ఆరుగురు మృగాళ్లు.. మొహానికి గుడ్డలు అడ్డు కట్టుకుని యువతిపై లైంగికముగా హింసించారు.. యువకుల చేతినుంచి విద్యార్థిని .. చాకచక్యంగా తప్పించుకుని పారిపోయింది..

ఈ ఘటన అక్టోబర్‌ 4న జరగ్గా .. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో సాక్ష్యంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డిసెంబర్‌ లో నలుగురు నిందుతులను అరెస్ట్‌ చేశారు పోలీసులు . తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *