లేటుగా బయటపడ్డ Bank ల భారీ మోసం…

ఎక్కువ మంది పేద ప్రజలు డబ్బు దాచుకునే ప్రదేశం గవర్నమెంట్ బ్యాన్క్స్.. ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ వినియోగదారులను భారీగా మోసం చేస్తోంది. ఎందుకు కట్ చేస్తున్నారో కారణం కూడా తెలియకుండా వినియోగదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు.. ఎవరైనా అడిగితె వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్నిసార్లు డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయో బ్యాంకు అధికారులకే కారణాలు తెలియవు. ఇటీవల ఒక వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు తన ఫోన్‌కు మెసేజ్ రావడం తో వెంటనే అనుమానం వచ్చిన వ్యక్తి , తన ఖాతా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు హైదరాబాద్ బ్రాంచ్‌కి వెళ్లి వివరణ కోరాడు. కానీ బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే ఆ వ్యక్తి “బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌”కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్‌మెంట్‌ కోసం 150 రూపాయలు కట్ చేసినట్లు తెలిపారు.

అసలు బ్యాంకు స్టేట్మెంటే తీసుకోలేదని.. ఆ సమయంలో బ్యాంకులోనే లేనని.. అయినా అధికారులు డబ్బులు కట్ చేశారని ఆయన తెలపడం గమనార్హం..
బ్యాంకు అధికారుల తీరును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లిన్నా అతడికి న్యాయం మాత్రం జరుగలేదు. అయితే పట్టువదలని వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ చార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదనను కోర్టుకి తెలియజేశాడు.. టు వెంటనే ఎస్‌బీఐ బ్యాంక్ హైదరాబాద్ బ్రాంచ్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను కోర్టు ఆదేశించింది..
ఏదైనా చార్జీల రుపంలో డబ్బులు కట్ అయినపుడు బ్యాంక్ అధికారులను ప్రశించడంలో ముందుండాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *