ఐదు మిరియాలతో ఐశ్వర్యం పొందాలంటే ..??

సహజంగా ప్రతి మనిషి జీవించడానికి ముఖ్యంగా ఆర్థిక వనరులు అవసరము,అనగా ఈ రోజుల్లో డబ్బు లేనిదే జీవించడం కష్టమే. అయితే చాల మంది కొత్త పనులు మొదలు పెట్టినప్పుడు,లేదా ఉన్న  ఐశ్వర్యం పోగుట్టుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే  ఐశ్వర్యంతో నష్ట పోకుండా ఉండాలంటే ఐదు మిరియాలతో ఐశ్వర్యం నిలబెట్టుకోవచ్చు ..

ఐదు మిరియాలతో పరిహారం ఎలా చేయాలి అని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ..!!

రాబోయే రోజుల్లో అమావాస్య వస్తుంది కనుక ప్రతి అమావాస్య రోజున ఉదయాన్నే తెల్లవారుజామున 4 .30 ని”ల నుండి 5 .00  గంటల సమయంలో నిదర లేచి తలస్నానం చేయాలి,వీలయితే ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. ఐదు మిరియాలు తీసుకొని తెల్లని వస్త్రాము లో మరి ఈ మిరియాలను మూటకట్టి, ఇంటి గుమ్మంలో గుమ్మడికాయ కట్టే ప్రదేశములో ఈ మిరియాల మూటను కట్టాలి.

తరువాత మళ్ళీ వచ్చే అమావాస్య ముందు రోజు ఈ మిరియాల మూటను విప్పి పక్కన ఉంచాలి.మళ్ళీ పైన చెప్పిన విధంగా గుమ్మడికాయ కట్టే ప్రదేశములో ఈ మిరియాల మూటను కట్టాలి.ఇలా 21 వ అమావాస్య రోజులు చేయాలి,చేసిన తరువాత ఆ మిరియాల మూటలన్నిటిని “శ్రీ లక్ష్మి నరసింహ దేవాలయంలో ” అక్కడ ఉంచాలి లేదా హుండీ లో వేయాలి.

ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్రం మరియు దృష్ట్యా శక్తుల నుండి విముక్తి కలుగుతుంది,ఇంకా  ఐశ్వర్యం పెరగటానికి మరియు ఉన్న సంపద నుండి నష్టాలు రాకుండా చేస్తుంది. ఇలా ఎవరైనా చేస్తారో ఆ “శ్రీ లక్ష్మి నరసింహ స్వామి “ని నమ్మి చేయండి,మీకు మంచి ఫలితం లభిస్తుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *